Viral Video: దేశ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మోచా తుపాను బంగ్లాదేశ్ సమీపంలో తీరాన్ని దాటిన నేపథ్యంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడి భగభగలతో మలమల మాడిపోయే పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు వివిధ మార్గాలను ప్రయత్నిస్తున్నారు.
ఎండను తాళలేక కొందరు ఏసీలు, కూలర్లు కొని సేద తీరుతున్నారు. బయట తిరగడం తప్పనిసరి అయిన వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వడగాలుల ధాటికి చాలా మంది విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రేమ జంట వేడిని తాళలేక వెరైటీ పని చేశారు. నడిరోడ్డుపై స్కూటీలో బకెట్‌లో నీరు పెట్టుకొని ప్రయాణిస్తూ వాటితో స్నానం చేయడం మొదలు పెట్టారు. దీన్ని చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ విచిత్రాన్ని కొందరు వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ యువతి వేగంగా వెళ్తున్న స్కూటీపై నీళ్లు పోసుకుంటూ వెళ్తోంది. స్కూటీ నడుపుతున్న యువకుడిపై కూడా నీళ్లు పోస్తూ కనిపించింది. దీంతో ఇదంతా చూసిన తోటి ప్రయాణికులు వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంత వేడి భరించలేకపోతే ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చోవాలని సూచిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండ వేడిమి భారీగా ఉంది. చాలా మంది ప్రజలు ఎండ నుంచి రక్షించుకోవడానికి గొడుగులు లేదా టోపీలను వాడుతున్నారు. అయితే, ఈ లవర్స్ చేసిన పనికి అందరూ ఇదేం విడ్డూరమంటూ ప్రశ్నిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వినోదం కోసం చేసిన ఇలాంటి చర్యలను ఉపేక్షించరాదని చెబుతున్నారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
@DGPMaharashtra @ThaneCityPolice
This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa— WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023
Read Also: Rama Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో తన్నులు తిన్న ఆ వ్యక్తి అంత పెద్ద మేధావా..!