HomecinemaRama Charan: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చేతిలో త‌న్నులు తిన్న ఆ వ్య‌క్తి అంత పెద్ద మేధావా..!

Rama Charan: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చేతిలో త‌న్నులు తిన్న ఆ వ్య‌క్తి అంత పెద్ద మేధావా..!

Telugu Flash News

Rama Charan: శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చేతిలో త‌న్నులు తిని వార్త‌ల‌లోకి ఎక్కాడు. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేందుకు మ‌నోడు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో సంచలన కామెంట్స్ చేస్తుంటాడు. స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నేనే హీరో, కాకపోతే మధ్యలో తీసేశారని ఏవో సొల్లు క‌బుర్లు చెబుతుంటాడు. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ నన్ను బ్రతిమిలాడితే వాళ్లకు ఆ సినిమాలు వదిలేశానని గొప్ప‌లు కూడా చెప్పుకొచ్చాడు. అలా అతనికి సాక్రిఫైజింగ్ స్టార్ బిరుదు వ‌చ్చింది. అయితే తనకి హీరోయిన్లతో చాలా లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అంటూ గతంలో సునిశిత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

లావణ్య త్రిపాఠి, రకుల్, కాజల్ ఇలా చాలా మంది హీరోయిన్లని టార్గెట్ చేస్తూ సునిశిత్ చేసిన వ్యాఖ్యల‌తో ఫుల్ పాపులారిటీ అయ్యాడు. లావ‌ణ్య త్రిపాఠితో అత‌నికి ర‌హ‌స్యంగా వివాహం జ‌రిగింద‌ని చెప్ప‌డంతో విసిగిపోయిన ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీనితో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా అతడి మానసిక స్థితి సరిగా లేద‌ని వ‌దిలిప‌ట్టారు. అయితే తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో రాంచరణ్ సతీమణి ఉపాసన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ హంగామా చేయడం అందరిని ఆశ్చర్యాన్ని క‌లిగింది. తాను ఉపాసన గోవాకి లాంగ్ డ్రైవ్ వెళ్లాం అని.. మేమిద్దరం ఫ్రెండ్స్ అని, రాంచరణ్ కూడా త‌న‌కు ఫ్రెండ్ అని.. ఉపాసనతో నార్మల్ గా చాట్ చేస్తుంటే.. రాంచరణ్ స్వయంగా ఉపాసనని పడేయ్ అని చెప్పాడని ఏవేవో పిచ్చి కామెంట్స్ చేశాడు.

ఇది విన్నచరణ్ ఫ్యాన్స్ అత‌నికి దేహశుద్ది చేయడంతో తప్పైపోయింది క్షమించాలి.. ఇకపై ఉపాసన గారి గురించి కానీ వేరే సెలెబ్రిటీల గురించి కానీ తప్పుగా మాట్లాడను అని క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఈ ఇష్యూ త‌ర్వాత సునిశిత్ పేరు హాట్ టాపిక్‌గా మార‌గా, అత‌ని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. సునిశిత్ మంచి ఉన్నత చదువులు చదివి అనేక డిగ్రీలు అందుకున్న విద్యావేత్త కాగా, ఎన్నో ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా పబ్లిష్ చేసిన మేధావి. వరంగల్ లో పుట్టిన ఆయ‌న‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్ లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా చేసాడు. ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ లలో మూడు పేపర్లు ప్రజెంట్ చేసిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌కి ఉంది. అనేక ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా పబ్లిష్ చేసిన మేధస్సు అతడిది కావ‌డం విశేషం. అలాంటి వాడు ఇలా ఎందుకు అయ్యాడో అర్థం కావడం లేదు అని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News