Homeviral newsViral Video : బయటకొచ్చి తిందామని చూశాడు.. న్యూడుల్స్‌తో పాటు గడ్డకట్టుకుపోయాడు.. అట్లుంటది మరి.. కెనడాతోని!

Viral Video : బయటకొచ్చి తిందామని చూశాడు.. న్యూడుల్స్‌తో పాటు గడ్డకట్టుకుపోయాడు.. అట్లుంటది మరి.. కెనడాతోని!

Telugu Flash News

Viral Video : ప్రస్తుతం చాలా దేశాలు మంచు తుఫాన్‌ గుప్పెట్లో చిక్కుకున్నాయి. మనుషులతో పాటు జలచరాలు, పశుపక్ష్యాదులు సైతం తీవ్రమైన ఇబ్బందులు ప డుతున్నాయి. ఈ నేపథ్యంలో బయట అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణంగా వేడివేడిగా టీ లేదా కాఫీ తాగాలని చాలామందికి అనిపిస్తుంది. వర్షం పడుతున్న వేళ లేదంటే చల్లటి వాతావరణం ఉంటే వెంటనే మంచి ఛాయ్‌ తాగాలనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో టీ తాగితే మనసుతో పాటు శరీరం హాయిగా అనిపిస్తుంది.

ఇలాంటి అనుభూతినే పొందాలనుకున్నాడు ఓ వ్యక్తి. భారీగా మంచు కురుస్తున్న ప్రదేశంలో వేడి వేడిగా న్యూడుల్స్‌ తిందామనుకున్నాడు. వేడి వేడిగా సెగలు కక్కుతున్న ఆ పదార్థాన్ని తీసుకున్నాడు. అయితే, అక్కడే తినాలనుకోలేదు. ఇంటికి తీసుకెళ్లి తిందామని ప్లాన్‌ చేశాడు. కానీ ఇంతలోపే కాస్త.. అక్కడి నుంచి బయటకు రాగానే.. సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది.


ఇంటికి తీసుకెళ్లి తిందామనుకున్న న్యూడుల్స్‌ కాస్తా ఏమయ్యాయో వీడియోలో వివరించాడు అతగాడు. దీన్ని వీడియో తీసి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జేక్‌ ఫిషర్‌ అనే వ్యక్తి స్వెటర్‌ వేసుకొని ప్రకృతిని ఆస్వాదించాలని వెళ్లాడు. న్యూడుల్స్‌ తీసుకొని ఇంటికి వెళ్తూ తిందామనుకున్నాడు. అయితే, అక్కడి నుంచి బయటకు రాగానే జేక్‌ జుట్టు, గడ్డం కూడా గడ్డకట్టుకుపోయింది. దాంతోపాటు న్యూడుల్స్‌ కూడా గడ్డకట్టుకుపోయాయి.

అతడి జుట్టు, గడ్డం, న్యూడుల్స్‌ కూడా మర్రి ఊడల్లా గడ్డకట్టుకొని పోయి దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయిపోయాడు జేక్‌ ఫిషర్‌. సెకన్ల వ్యవధిలోనే స్పూన్‌తోపాటు కదలకుండా గాల్లో ఉండిపోయాయి. ఈ సీన్‌ అంతా జేక్‌ తన కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. న్యూడుల్స్‌ కంటే అతడి జుట్టునే చూశామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jake Fischer (@voicesofjake)

also read:

Directors: ఇద్దరు టాప్ ద‌ర్శ‌కుల‌కి ప్ర‌మాదాలు… టెన్ష‌న్‌లో అభిమానులు

-Advertisement-

Gajendra Moksham : భాగవతంలోని అపూర్వ గాధ ‘గజేంద్ర మోక్షం’ గురించి తెలుసుకోండి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News