Homeandhra pradeshAP News : ఫేక్‌ వార్తలతో దుష్ప్రచారం మీకే సొంతం.. నాగబాబుపై రోజా ఫైర్‌!

AP News : ఫేక్‌ వార్తలతో దుష్ప్రచారం మీకే సొంతం.. నాగబాబుపై రోజా ఫైర్‌!

Telugu Flash News

AP News : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. ఓ వైపు చంద్రబాబు మరోవైపు పవన్‌ కల్యాణ్‌.. కలిసి సీఎం జగన్‌ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ, జనసేన సహా ఇతర పక్షాలన్నింటినీ కలిపేస్తూ వైఎస్‌ జగన్‌.. వీరందరినీ దుష్టచతుష్టయంగా అభివర్ణిస్తూ అనేక సందర్భాల్లో వీరిపై మండిపడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు కూడా అప్పుడప్పుడూ ఏపీ మంత్రులపై కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు గానూ నాగబాబు కౌంటర్‌ ఇవ్వడం తర్వాత నాగబాబుకు కూడా రోజా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వడం జరిగిపోయాయి.

రోజా చేపట్టిన మంత్రి పదవి గురించి, ఆమె చేసిన అభివృద్ధి గురించి నాగబాబు కాంమెట్లు చేశారు. ఇందుకు కారణం చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఉద్దేశిస్తూ రోజా చేసిన వ్యాఖ్యలే. ఇందుకు నాగబాబు స్పందిస్తూ.. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు.. అభివృద్ధి చేయడమంటూ కౌంటర్‌ ఇచ్చారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌పై రోజా వ్యాఖ్యలు సరికాదని నాగబాబు హితవు పలికారు. రోజా నోటికొచ్చినట్లు మాట్లాడినా తాను స్పందించకపోవడానికి కారణం ఉందన్నాడు నాగబాబు.

రోజా నోటికి, మున్సిపాలిటీ తొట్టికి పెద్ద తేడా లేదంటూ నాగబాబు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో మంత్రి రోజా స్పందించారు. తన శాఖ అభివృద్ధి గురించి నాగబాబు అవగాహనా రాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. విమర్శ చేసేటప్పుడు విషయం తెలుసి ఉంటే పర్వాలేదని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సరికాదని నాగబాబును హెచ్చరించారు రోజా. ఫేక్‌ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం మీకే చెల్లుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. ఏపీ గురించి నాగబాబుకున్న జ్ఞానం శూన్యం అంటూ.. ఫైర్‌ అయ్యారు రోజా.

వైసీపీ వర్సెస్‌ జనసేన

ట్విట్టర్‌లో పోస్టుతో జనసేన వర్సెస్‌ వైసీపీ పోరుగా మారిపోయింది. అటు నాగబాబు అభిమానులు, ఇటు రోజా ఫ్యాన్స్‌ కలిసి రచ్చ చేయడం మొదలు పెట్టారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పవన్‌ అభిమానులు, మెగా ఫ్యాన్స్‌ రోజాపై మండిపడుతుండగా.. అటు వైసీపీ శ్రేణులు సైతం సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్నారు.

also read:

Viral Video : బయటకొచ్చి తిందామని చూశాడు.. న్యూడుల్స్‌తో పాటు గడ్డకట్టుకుపోయాడు.. అట్లుంటది మరి.. కెనడాతోని!

-Advertisement-

Directors: ఇద్దరు టాప్ ద‌ర్శ‌కుల‌కి ప్ర‌మాదాలు… టెన్ష‌న్‌లో అభిమానులు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News