Telugu Flash News

Viral video : రోడ్డుపై బైక్‌లో కపుల్‌ రొమాన్స్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌

couple romance on two wheeler

Viral video : ప్రేమలో ఉన్నప్పుడు లోకాన్నే మైమరచిపోతుంటారు కొందరు లవర్స్‌. అయితే, నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ పబ్లిక్‌గా రొమాన్స్‌ చేస్తామంటే మన దేశంలో కుదరదు. కానీ చాలా మంది యువత తమ లవర్లతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతుంటారు. రోడ్లపై బైకుల్లోనూ, కార్లలోనూ షికార్లు చేస్తుంటారు. ఇటీవల ఓయో రూముల సంస్కృతి పెరిగిపోయిన తర్వాత ఇది మరింత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా ఓ జంట రోడ్డుపై చేసిన రచ్చ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నడి రోడ్డుపై ఇతర వాహనాలు వెళ్తున్నా ఈ జంట అవేమీ పట్టించుకోలేదు. ఏకంగా బైక్‌ ముందు భాగంలో ప్రియురాలిని కూర్చోబెట్టుకున్న ప్రియుడు.. గాఢంగా హత్తుకొని డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాడు. వెనుక నుంచి ఇద్దరు వ్యక్తులు వీరిని ఫాలో అయ్యారు. సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముందీ.. క్షణాల్లో ఈ వీడియో విస్తరించింది.

లక్నోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కదులుతున్న బైక్‌పై లవర్స్‌ రొమాన్స్‌ చేసుకుంటూ వెళ్లారు. లక్నో లోని హజ్‌రత్‌గంజ్‌ ప్రాంతంలో మంగళవారం ఈ ఉదంతం వెలుగు చూసింది. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వెంటనే వేల కొద్దీ వ్యూస్‌ వచ్చేశాయి. అయితే, దీనిపై పోలీసులకు కూడా సమాచారం చేరింది.

లవర్స్‌పై పోలీసుల చర్యలు

ఈ ఘటనపై లక్నో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అపర్నా రాజ్‌ కౌశిక్‌ మీడియాతో మాట్లాడారు. ఈ ఇన్సిడెంట్‌ లక్నోలోని హజ్‌రత్‌గంజ్‌ ప్రాంతంలో జరిగిందని నిర్ధారించారు. వారిని వెతికి పట్టుకోవడానికి ఇద్దరు పోలీసు బృందాన్ని పంపినట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల్లో పరిశీలించిన తర్వాత నిర్ధారణ చేసినట్లు తెలిపారు. మోటార్‌ వెహికల్‌ చట్టం కింద వీరిద్దరిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. సామాజికంగా ఇది సరైన ప్రవర్తన కాదని డీసీపీ తెలిపారు. దాంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించారని, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

also read:

ఎన్టీఆర్‌ వర్ధంతి.. కుటుంబ సభ్యుల నివాళి.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు!

Sriharikota News : జవాను ఆత్మహత్య.. జవాను భార్య కూడా.. శ్రీహరికోటలో తీవ్ర విషాదం.. అసలేం జరుగుతోంది ?

Exit mobile version