Viral Video : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అలాంటి వేడుకలు కలకలం గుర్తుండిపోవాలనే ఆశతో కొందరు తుంటరి పనులు చేస్తుంటారు. వధూవరులను ఆటపట్టించడం, చిలిపిచేష్టలు లాంటివి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో బాణసంచా పేల్చడం, కేక్ కట్ చేస్తూ పెద్ద శబ్దంతో కూడిన వస్తువులు పేల్చడం లాంటివి సాధారణం అయ్యాయి.
ఇదే కోవలో ఓ జంట తమ ప్రీ వెడ్డింగ షూట్లో కాస్త డిఫరెంట్‌గా ప్రయత్నించారు. అయితే, ఈ అనుభవం వారికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ సందర్భంగా అలంకణ, ఆర్కెస్ట్రాతో పాటు అనేక కార్యక్రమాలు చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ కార్యక్రమాలన్నీ వీడియోలు, ఫొటోల రూపంలో భద్రంగా దాచుకుంటూ ఉంటారు.
ఇక వివాహ రిసెప్షన్ సమయంలో కేక్ కటింగ్ పాపప్ లాంటివి కనిపిస్తుంటాయి. ఇలా వేడుక జరుపుకోవాలని ప్లాన్ చేసిన ఓ జంటకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. పెళ్లి తర్వాత రిసెప్షన్ ఘనంగా జరుగుతుండగా వేదికపై కొత్త జంట కేక్ కట్ చేసే ముందు రెండు తుపాకులు చేత పట్టుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులు చప్పట్లతో అభినందిస్తున్నారు.
తర్వాత తుపాకులను పేల్చమని చెప్పడంతో ఫొటోలకు పోజులిస్తూ వాటిని పేల్చారు. అంతే.. ఈ సమయంలో వధువు తుపాకీ ప్రమాదవశాత్తూ పేలి మంటలు వచ్చాయి. ముఖానికి అంటుకున్నాయి. అనంతరం భయపడిపోయిన వధువు కేకలు వేస్తూ పారిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. వివాహ రిసెప్షన్లో ఇలా అనుకోని ఘటన జరగడంతో ఆ ప్రాంతమంతా సైలెంట్ అయిపోయింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విట్టర్లో పెట్టారు. మహారాష్ట్రలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను అదితి షేర్ చేయగా నెటిజన్లు స్పందిస్తున్నారు. వీడియోకు మూడు లక్షల మందికిపైగా వ్యూస్ వచ్చాయి.
Idk what's wrong with people these days they are treating wedding days more like parties and this is how they ruin their perfect day. 🤷♀️ pic.twitter.com/5o626gUTxY
— Aditi. (@Sassy_Soul_) March 31, 2023
భయంకరంగా ఉందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. హాయిగా పెళ్లి చేసుకోక ఇవన్నీ అవసరమా అంటూ మరికొందరు నెటిజన్లు చురకలంటిస్తున్నారు. అయితే, వధువుకు తీవ్ర గాయాలేమీ కాలేదని, స్వల్ప గాయాలయ్యాయని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోవాల్సిన ఈ ఘటన చేదు జ్ఞాపకంగా మిగిలిందని పెళ్లికుమార్తె తరఫు బంధువులు వాపోయారు.
also read:
Anasuya : ఆంటీ అంటే తనకు కోపమెందుకో చెప్పేసిన అనసూయ
IPL 2023: రికార్డుల వేటలో కింగ్ కోహ్లీ.. డివిలియర్స్, రోహిత్‌ను వెనక్కి నెట్టాడు