Viral Video : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక మనదేశంలో ట్యాలెంట్ ఏ మూలన ఉన్నా వెలుగులోకి వస్తోందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంపై అందరికీ అవగాహన రావడంతో ప్రతి ఒక్కరూ తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ దూసుకెళ్తున్నారు. ఇందులో యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్‌లలో వీడియోలు.. ఇలా అనేక రకాలుగా వీడియోలు తీస్తూ తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. చిన్నారులు, యువత మొదలుకొని పెద్దల వరకూ తమ పాటలు, నృత్యాలు, కళలతో ఆకట్టుకుంటున్నారు.
తాజాగా తండ్రీ, కుమార్తె కలిసి అలనాటి చిత్రంలోని పాట పాడి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రొఫెషనల్ గాయకుల్లా పాత పాటను పాడుతూ మెప్పించారు. ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అబ్బా.. ఎంత చక్కటి గాత్రం.. పర్ఫెక్ట్గా సింక్ అయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 1976లో బాలీవుడ్లో వచ్చిన ఛరస్ చిత్రంలో ధర్మేంద్ర, హేమమాలిని హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలోని ఓ పాటను తండ్రీ కుమార్తె కలిసి పాడారు.
ఆ సినిమాలో నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్, అమర గాయకుడు కిశోర్ కుమార్ పాడిన పాపులర్ పాట అయిన.. కల్ కీ హసీన్ ములాఖత్ కేలియే.. సాంగ్‌ను వీరిద్దరూ ఓ రిథమ్‌లో ఆలపించారు. తండ్రితో కలిసి పాడిన యువతి.. సెల్ఫీ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. యువతి పేరు జుహీ సింగ్. ఇన్ స్టా గ్రామ్‌తో పాటు ట్విట్టర్లోనో పోస్ట్ చేసింది జుహీ సింగ్.
ఎంత మధుర గాత్రం..
తన తండ్రితో పాటు గాత్రం కలిపిన యువతి జుహీ సింగ్.. అద్భుతంగా పాడింది. ఈ వీడియోకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో జుహీ సింగ్.. కల్ హీ హసీన్ ములాఖత్ కేలియే.. హమే పెహలే ఛాహియే అచ్చీ నీంద్. గుడ్ నైట్ సాంగ్ ఫ్రం డాడ్ అండ్ మీ.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పోస్ట్ చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే 8 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. వెయ్యి మందికిపైగా లైక్ చేశారు. అంకుల్ వాయిస్ ఎంత స్వీట్‌గా ఉందోనని ఓ యూజర్ కామెంట్ చేశారు.
View this post on Instagram