HomecinemaVijaykanth: విజ‌య్ కాంత్‌ని చూసి ఆవేద‌న చెందుతున్న ఫ్యాన్స్..

Vijaykanth: విజ‌య్ కాంత్‌ని చూసి ఆవేద‌న చెందుతున్న ఫ్యాన్స్..

Telugu Flash News

Vijaykanth: త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరో విజ‌య్‌కాంత్ ప్ర‌స్తుతం అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్ళు.. కాగా, కొన్నేళ్ల నుండి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారట. ఆ కారణంగానే గతేడాది వైద్యులు ఆయన కాలికి మూడు వేళ్లను కూడా తొలగించారు.

ప్ర‌స్తుతం వీల్ చైర్‌కే ప‌రిమితం అయిన వియకాంత్ 33వ వివాహ వార్షికోత్సవం నిర్వహించారు కుటుంబ సభ్యులు. 1990లో జనవరి 31న ప్రేమలతను పెళ్లాడగా, ఈ దంపతులిద్దరినీ పూలమాలలతో సత్కరించారు కుటుంబీకులు.

vijaykanth 33rd wedding anniversary

వారి వార్షికోత్స‌వానికి సంబంధించి ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫోటోలో విజయకాంత్ ని చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ‘సాలిడ్ పర్సనాలిటీ కలిగిన మా కెప్టెన్ ఏంటి ఇలా అయిపోయారు?’ అని కామెంట్స్ చేస్తున్నారు. వీల్ చైర్ లో ఉన్న విజయకాంత్ మాస్క్ ధరించి, బాగా చిక్కిపోయి కనిపిస్తున్నారు .

తన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ మూవీతో ‘కెప్టెన్’ బిరుదుతో ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఈయన సినిమాలు తెలుగుతో పాటు హిందీలోకి కూడా డబ్ కాగా, అవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి.

also read news :

-Advertisement-

ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్‌ తింటే తిరుగుండదు!

ఫేస్‌ ఆయిల్స్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం.. ఎలా వాడాలో తెలుసుకోండి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News