HomecinemaVijay-Tamanna | విజయ్ తో రిలేషన్ షిప్ నిజమే : తమన్నా

Vijay-Tamanna | విజయ్ తో రిలేషన్ షిప్ నిజమే : తమన్నా

Telugu Flash News

Vijay-Tamanna : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (tamanna) బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (vijay varma) తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరు ముద్దులు పెట్టుకున్న వీడియో సంచలనం సృష్టించింది. దాంతో బాలీవుడ్, టాలీవుడ్ సహా సోషల్ మీడియా కూడా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు హంగామా చేస్తోంది. అంతేకాదు వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు వెళుతుండగా మీడియా కంటపడ్డారు. దీనిపై ఎన్నిసార్లు అడిగినా వారిద్దరూ స్పందించలేదు.

ఈ సందర్భంగా విజయ్ వర్మతో తనకున్న సంబంధం గురించి తమన్నా చెప్పేసింది. విజయ్‌తో తనకున్న రిలేషన్ నిజమేనని ఒప్పుకుంది. తమ ప్రేమకథ ‘లస్ స్టోరీస్ 2’ సెట్స్‌లోనే ప్రారంభమైందని వెల్లడించారు. ఈ సినిమాలో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంటకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. విజయ్ వర్మతో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడింది. విజయ్ సహనటుడు కాబట్టి నచ్చలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. అయితే విజయ్ ఓ ప్రత్యేక వ్యక్తి. అతను నాకు రక్షణగా ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఆయన నా మనసుకు దగ్గరైన వ్యక్తి. అతను నన్ను చాలా పట్టించుకుంటాడు. అతను ఉన్న ప్రదేశం నాకు అత్యంత సంతోషకరమైన ప్రదేశం అని చెప్పింది. ప్రస్తుతం తమన్నా.. చిరంజీవి నటించిన ‘భోలా శంకర్’తో పాటు టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో చాలా చిత్రాలతో బిజీగా ఉంది.

see more :

Tamanna Stunning Hot Photoshoot 12.06.2023 🔥🔥🔥

Actress Tamanna latest photoshoot pics 11-06-2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News