Homecinemaజవాన్‌ సినిమా కోసం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్‌ తెలిస్తే షాకవుతారు..!

జవాన్‌ సినిమా కోసం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్‌ తెలిస్తే షాకవుతారు..!

Telugu Flash News

తమిళ హీరో విజయ్‌ సేతుపతి (vijay sethupathi) నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . తన పాత్ర నచ్చిందంటే చాలు భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా సినిమాలు చేయడానికి వెనకాడడు. ఉప్పెన మూవీ తో తెలుగులో విలన్‌గా పరిచయమయ్యాడు.

విజయ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌(sharukh khan), తమిళ డైరెక్టర్‌ అట్లీ (atlee) కాంబినేషన్‌లో రూపొందుతున్న జవాన్‌ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడని తెలుస్తుంది .

ఈ పాన్‌ ఇండియా సినిమాకోసం విజయ్ ని ఒప్పించేందుకు 21 కోట్ల రూపాయలు ఇస్తున్నారట.ఈ మద్య విడుదలైన విక్రమ్‌ సినిమాలో విజయ్ సేతుపతి నటించిన పాత్రకు మంచి స్పందన రావడంతో తన రెమ్యునరేషన్‌ను రూ15 కోట్ల నుండి 21 కోట్ల మేరకు పెంచాడట విజయ్‌ సేతుపతి.

అదే కాకుండా జవాన్‌ సినిమా కోసం తమిళ్ లో ఒప్పుకున్న రెండు సినిమాలను కూడా వదిలేసుకున్నట్లు సమాచారం. దీంతో జవాన్‌ మూవీ మేకర్స్ అతడు అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్నారట.

ఇక జవాన్‌ సినిమా లో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా దీపికా పడుకునే ఓ కీ రోల్ లో కనిపించనుంది. ఇటీవలే దీపిక రోల్‌కు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది.

బాయ్‌కాట్ ట్రెండ్ పై విక్రమ్ ఫన్నీ రిప్లై

-Advertisement-

లైగర్‌ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడు ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News