HomecinemaVijay- Rashmika : ర‌ష్మిక‌, విజ‌య్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది..? మొన్న మాల్దీవులు.. ఇప్పుడు దుబాయ్ టూర్..

Vijay- Rashmika : ర‌ష్మిక‌, విజ‌య్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది..? మొన్న మాల్దీవులు.. ఇప్పుడు దుబాయ్ టూర్..

Telugu Flash News

Vijay- Rashmika : టాలీవుడ్ క్రేజీ జంట‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. మొదటిసారి గీతగోవిందం సినిమాతో మంచి పెయిర్ గా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ – రష్మిక.. ఆ ఒక్క సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి, యూత్ కి బాగా దగ్గరయ్యారు.

ఆ తర్వాత మళ్లీ డియర్ కామ్రేడ్ లో రెండోసారి జంటగా క‌నిపించారు. ఈ సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయిన వీరి మ‌ధ్య మాత్రం ల‌వ్ పుట్టిన‌ట్టు తెలుస్తుంది. వీరిద్ద‌రు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతూ వస్తున్నారు.

ఇద్దరు కలిసి రెగ్యుల‌ర్‌గా సినిమాలు చేయకపోయినా.. వేరే సినిమాలతో బిజీగా ఉన్నా.. త‌ర‌చు మీట్ అవ్వడం, డిన్నర్స్ కి, టూర్స్ కి వెళ్లడం.. మొత్తానికి చెట్టాపట్టాలేసుకుంటూ తిరగడం మాత్రం జరుగుతూనే ఉంది.

ఆ మధ్య ముంబైలో కనిపించిన ఈ జంట.. ఆ తర్వాత మాల్దీవ్స్ కి వెళ్లి కెమెరా కంట చిక్కారు. ఈ క్ర‌మంలో డేటింగ్, లవ్ అంటూ కథనాలు గట్టిగా వినిపించాయి. కానీ, అవేవి నిజం కాదని, ఫ్రెండ్స్ మాత్రమే అని ఓ ఇంటర్వ్యూలో కొట్టిపారేసింది రష్మిక.

తాజాగా విజయ్, రష్మిక ఇద్దరు రీసెంట్ గా దుబాయ్ టూర్ కి వెళ్లారు. ఈ ఇద్దరితో ఓ వ్యక్తి ఫోటో దిగుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో మరోసారి విజయ్ – రష్మికల లవ్ ట్రాక్ మ్యాటర్ చర్చనీయాంశంగా మారింది.

also read :

-Advertisement-

ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

Hanuma Vihari : లెఫ్ట్‌ హ్యాండర్‌గా మారిన హనుమ విహారి.. గాయం కారణంగా ఒంటిచేత్తోనే పోరాటం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News