HomecinemaVijay Devarakonda: వేణు స్వామి చెప్పింది నిజ‌మేనా.. విజ‌య దేవ‌ర‌కొండ‌కి అన్ని ఫ్లాపులా?

Vijay Devarakonda: వేణు స్వామి చెప్పింది నిజ‌మేనా.. విజ‌య దేవ‌ర‌కొండ‌కి అన్ని ఫ్లాపులా?

Telugu Flash News

Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా మారాడు విజ‌య్. ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’తో తెలుగు మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ కు ద‌గ్గ‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ త‌ర్వాత మాత్రం అంత‌గా అల‌రించ‌లేక‌పోయాడు.

కొన్నాళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో డీలా ప‌డ్డ విజ‌య్ లైగ‌ర్ సినిమాతో భారీ హిట్ కొడ‌తాడ‌ని అంద‌రు ఊహించారు. కాని లెక్క‌లు అన్ని తారుమారు అయ్యాయి. ఈ చిత్రం దారుణ‌మైన ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో విజ‌య్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ వచ్చి చేరింది.

విజ‌య్ జాత‌క ప్ర‌భావం…

విజయ్ దేవరకొండకు కేరీర్ లో దెబ్బ మీద దెబ్బ పడటానికి కారణంలో ఏంటో తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి స్ప‌ష్టం చేశారు. విజయ్ జాతకం బాలేని కార‌ణంగా ఆయన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయని చెప్పుకొచ్చాడు.

విజ‌య్ కి ప్ర‌స్తుతం అష్ట‌మి న‌డుస్తుంద‌ని, జాత‌కం రీత్యా అష్టమ శని ప్రారంభం అవ్వడం తో ‘లైగర్’కు ముందు వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం కూడా డిజాస్టర్ అయింద‌ని చెప్పుకొచ్చారు వేణు స్వామి. మున్ముందు కూడా ఆయ‌న కెరీర్ క‌ష్టంగానే సాగుతుంద‌ని చెప్ప‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

గతంలో సమంత – నాగ చైతన్యల విడాకులపై వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు నిజం కావ‌డంతో కొంద‌రు వేణు స్వామి వ్యాఖ్య‌ల‌కి ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం విజయ్ జాతకంపై ఆయ‌న ఇలా కామెంట్స్ చేయడం ఫ్యాన్స్ కు కాస్తా బాధ కలిగిస్తోంది.

ఇక విజయ్ – సమంత కలిసి ‘ఖుషి’లో నటిస్తుండ‌గా, ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌రి ఈ సినిమా అయిన విజ‌య్‌కి హిట్ అందిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే విజ‌య్ ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌నే చెప్పాలి.

-Advertisement-

ఇవి కూడా చదవండి 

Pawan Kalyan: బాల‌కృష్ణ‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

cashew nuts :జీడిపప్పులో ఉన్న పోష‌కాలు తెలిస్తే అస్స‌లు వ‌దిలి పెట్ట‌రు..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News