Homehealthజిమ్‌కు వెళ్లకుండానే కండరాలు పెంచుకోవాలంటే? ఈ కూరగాయలు తినండి!

జిమ్‌కు వెళ్లకుండానే కండరాలు పెంచుకోవాలంటే? ఈ కూరగాయలు తినండి!

Telugu Flash News

మార్కెట్‌లో చాలా రకాల కూరగాయలు కనిపిస్తాయి. ఇందులోప్రోటీన్‌తో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియంలు ఉన్నాయి. దీనిని జిమ్‌కి వెళ్ళేవారు మాత్రమే కాదు.. ఎవరైనా తినొచ్చు. ఎముకలు, కళ్ళకి మంచిది. దీనిని తినడం వల్ల అధిక బరువు తగ్గి కండరాలు బలంగా తయారవుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి. మెగ్నీషియం కంటెంట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. గ్లూకోజ్ జీవక్రియకి హెల్ప్ చేస్తుంది.

కండరాల బలహీనంగా ఉంటే ఏం చేయాలి?​ ​

పచ్చి బఠానీలు..

ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉన్న ఈ బఠానీలు తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎర్ర రక్తకణాలు తగయారు చేసి ఆక్సీజన్ సరఫరాకి హెల్ప్ చేస్తుంది. ఈ బఠానీలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కొన్ని క్యాన్సర్స్‌ని దూరం చేస్తాయి. ​

బ్రకోలీ..

బ్రకోలీని ఇంతకు ముందు రోజుల్లో ఎవరు ఎక్కువగా వాడేవారు కాదు. కానీ, ప్రజెంట్ పెరిగిన అవగాహనతో దీనిని తింటున్నారు. ఇందులో పోషకాలు, ప్రోటీన్స్ ఉంటాయి. ఫైబర్, విటమిన్స్, విటమిన్స్ సి కెలు, ఫోలేట్స్ ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో కొన్ని క్యాన్సర్స్ దూరమవుతాయి. దీనిని తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్స్ దూరమవుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్స్, కండరాలకు అవసరమైన కొల్లాజెన్‌ని అందిస్తుంది.

క్యాబేజీ..

-Advertisement-

క్యాబేజీని ఎక్కువ మంది అంతగా తినరు. కానీ, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియని పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాబేజీలో విటమిన్ కె, సి, ఫోలేట్స్ ఉన్నాయి. క్యాబేజీలో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు.

పుట్టగొడుగులు..

పుట్టగొడుగుల్లో కూడా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, మినరల్స్ కండరాలని బలాన్ని అందిస్తాయి. ఇందులో విటమిన్ డి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మాంసం తినలేని వారు వీటిని తీసుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇవి బ్రెయిన్ హెల్త్‌కి కూడా మంచివి. ​

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News