HomecinemaVarshini Sounderajan : గొప్పింటి కోడ‌లు కాబోతున్న యాంక‌ర‌మ్మ‌... ఎందుక‌మ్మ ఇంత తొంద‌రా?

Varshini Sounderajan : గొప్పింటి కోడ‌లు కాబోతున్న యాంక‌ర‌మ్మ‌… ఎందుక‌మ్మ ఇంత తొంద‌రా?

Telugu Flash News

Varshini Sounderajan: తెలుగులో త‌మ అందచందాలతో అల‌రిస్తున్న యాంక‌ర‌మ్మ‌ల‌లో వర్షిణి కూడా ఒక‌రు. నటిగా పరిచయం అవడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి, తన అందచందాలతో ఆకట్టుకుంది. కొన్ని జాతీయ బ్రాండ్లకు కూడా అంబాసీడర్‌గానూ చేసింది. వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల‌తో సైతం అద‌ర‌గొట్టేసింది. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు తొలి సినిమాతో మంచి విజ‌యం సాధించిన త‌ర్వాత ఆఫ‌ర్స్ లేవు. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ ఇచ్చి ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ తో మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చింది.

పెళ్లి క‌ళ‌…

బుల్లితెర బ్యూటీ టీవీ ఆడియెన్స్, యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ వర్షిణి సౌందరరాజన్ త‌న చలాకీ మాట‌ల‌తో పాటు అంద‌చందాల‌తోను తెగ అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు నడుము వంపులతో… వయ్యారాలు పోతూ.. చూపు తిప్పుకొని అందంతో కుర్రాలను కట్టిపడేస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా.. ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేకపోతుంది చిన్నది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ద‌మైందట‌. తాను కోటీశ్వరుల ఇంటి కోడులు కాబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బంధువల సంబంధం అని అంటున్నారు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు.

బావ‌నే వ‌ర్షిణి పెళ్లి చేసుకోనుంద‌ని తెలుస్తుండ‌గా, చిన్నప్పటి నుంచి తనకు వాళ్ళ బావ అంటే ఎంతో ఇష్టమట‌.. వాళ్ళ బావకి కూడా తనంటే ఇష్టమని ఈ క్రమంలోనే ఇంట్లోని పెద్ద‌లు వారిద్ద‌రికి వివాహం చేయాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఇంద‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.సమంత నటిస్తోన్న ‘శాకుంతలం’, సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ వంటి సినిమాలు చేసింది. మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతూ వ‌స్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News