Telugu Flash News

varasudu telugu movie review : ‘వారసుడు’ తెలుగు మూవీ రివ్యూ

varasudu movie review

varasudu movie review

varasudu telugu movie review :  సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన చిత్రాల‌లో వారిసు ఒక‌టి. తెలుగులో వార‌సుడు పేరుతో రాబోతున్న ఈ సినిమా ముందుగా తమిళంలో విడుదల చేసారు. తమిళ హీరో విజయ్ చిత్రం అయినా ఇందులో తెలుగు వారి పాత్ర ఎక్కువ. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు వారిసు సినిమాను నిర్మించారు. త‌మిళంలో ఆయ‌న నిర్మిస్తోన్న మొద‌టి సినిమా కాగా, తెలుగు స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. తెలుగువారి అభిమాన స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా వారిసులో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తోంది. తెలుగు నుంచి జ‌య‌సుధ‌, శామ్‌, శ్రీకాంత్‌, సంగీత‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషించారు. తెలుగులో విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

క‌థ:

సిటీలో ఒక వ్యాపార వ్యాపారవేత్తకు పెద్ద కుటుంబం ఉంటుంది, కానీ అతని కుమారుడు విజయ్ రాజేంద్రన్(విజయ్) వ్యాపారం గురించి పెద్ద‌గా పట్టించుకోడు . అతను తన జీవితాన్ని కోరుకున్న విధంగా ఆనందిస్తూ ఉంటాడు . అంతా సజావుగా ఉన్నట్లు అనిపించినా వ్యాపార ప్రత్యర్థి తన తండ్రి వ్యాపారాన్ని టేకోవర్ చేయడానికి మాత్రం ఓ కన్నేసి ఉంచాడు అని తెలియడం తో విజయ్ రాజేంద్రన్ సీఈఓ గా బాధ్యతలు చేపడ్తాడు, చివరకు విజయ్ రాజేంద్రన్ అన్ని సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనేది చిత్ర క‌థ‌గా తెలుస్తుంది. ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్…తన మంచితనం, కుటుంబం పట్ల ప్రేమ, బిజినెస్ తెలివితో ఎలా తనే వారసుడు అనిపించుకున్నాడు. తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు. ప్రత్యర్దిగా ఉండి కుట్ర చేస్తున్న జయప్రకాష్ కి ఎలా బుద్ది చెప్పాడు అన్న‌ది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప‌ర్‌ఫార్మెన్స్:

విజయ్ నటన గురించి మాట్లాడాల్సి వ‌స్తే, ఈ రకమైన పాత్ర అతనికి కేక్‌వాక్ లాంటింది , రష్మిక మందన పాటలలో బాగానే ఉంది, కానీ ఆమె నటనలో విఫలమైంది, మరియు మిగిలిన తారాగణం జయసుధ, శరత్‌కుమార్, శ్రీకాంత్ మరియు ప్రకాష్‌రాజ్‌ కథకు తగ్గట్టుగా తమ పాత్రలు చేశారు. టెక్నికల్‌గా వారసుడు అత్యున్నత స్థాయిలో ఉంటుంది. కార్తీక్ పళని విజువల్స్ సినిమాని రిచ్‌గా చూపించాయి మరియు థమన్ ఎస్ సినిమా వెన్నెముకగా నిలిచాడు, అతను అద్భుతమైన పని చేసాడు. పాటలు లేదా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అతను సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో చాలా సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. మిగిలిన టెక్నికల్ టీం బాగా చేసింది.

ప్ల‌స్ పాయింట్స్

వింటేజ్ విజయ్
కామెడీ వన్ లైనర్స్
యోగిబాబుతో వచ్చే సీన్స్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ
ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే
ఫ్యాన్స్ కు నచ్చే సీన్స్ కు ప్రయారిటీ ఇవ్వటం

విశ్లేష‌ణ‌:

వంశీ పైడిపల్లి ఊపిరి మరియు మహర్షి వంటి కొన్ని సినిమాలతో కీర్తిని పొందిన విష‌యం తెలిసిందే. తలపతి విజయ్‌తో ఆయ‌న‌కి సినిమా చేసే అవకాశం పొందడం గొప్ప అవకాశం, కానీ అతను ఇక్కడ చేసినట్లుగా రొటీన్ మరియు పాత సబ్జెక్ట్‌తో వెళ్ళాడు. వారసుడు సినిమాను బాగా డీల్ చేసినా ఈ సినిమా చిరకాలం గుర్తుండిపోదు అని చెప్పాలి. ఓవరాల్‌గా, వారసుడు ఓల్డ్-స్కూల్ ఫ్యామిలీ డ్రామా, ఇది అందరికీ నచ్చక‌పోవ‌చ్చు. ఇది పూర్తిగా దళపతి అభిమానుల కోసం రూపొందించబడింది అని చెప్పాలి..

Also Read:

horoscope today telugu : జనవరి 14, 2023 ఈ రోజు రాశి ఫలాలు

Viral video: ఔరా.. ఏం ధైర్యం? పులిని చేతులతో పట్టుకొస్తున్న మహిళ..!

రోజా వర్సెస్‌ పవన్‌ కల్యాణ్‌.. రాజకీయ డైలాగ్‌ వార్‌లో ఎవరిది పైచేయి?

Exit mobile version