Sunday, May 12, 2024
HomeinternationalJack Teixeira : రెండు పదుల వయసుకే అమెరికా రహస్యాలు బయటపెట్టాడు.. యువకుడిని అరెస్టు చేసిన ఎఫ్‌బీఐ

Jack Teixeira : రెండు పదుల వయసుకే అమెరికా రహస్యాలు బయటపెట్టాడు.. యువకుడిని అరెస్టు చేసిన ఎఫ్‌బీఐ

Telugu Flash News

Jack Teixeira : ఆ కుర్రాడి వయసు 21 సంవత్సరాలు. అయితేనేం, అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రహస్య సమాచారాన్ని లీక్ చేశాడు. ఈ అంశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా జాతీయ రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా బయట పెట్టాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ కుర్రాడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆ యువకుడిపై చర్యలు తీసుకొనేందుకు యూఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఘటన నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు ప్రభుత్వ రహస్యాలు ఎలా కనుక్కొన్నాడో తెలియక సతమతం అవుతున్నారు. మసాచుసెట్స్‌లోని దిఘ్టన్‌కు చెందిన జాక్ టెయ్‌క్సెయ్‌రా ను ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.

Poorna: పూర్ణ‌తో ఎఫైర్‌పై ఎట్ట‌కేల‌కు స్పందించిన ర‌విబాబు..!

అతడు రహస్యమైన అమెరికన్ నేషనల్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్‌‌ అనధికారిక తొలగింపు, రిటెన్షన్, ట్రాన్స్‌మిషన్‌ లాంటి అక్రమాలకు పాల్పడినట్లు అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ పేర్కొన్నారు. జాక్ టెయ్‌క్సెయ్‌రా సైబర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ జర్నీమేన్‌గా వర్క్ చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి ఉద్యోగంలో చేరాలంటే హైస్కూల్ డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్, 18 నెలలపాటు శిక్షణ తప్పనిసరి. పెంటగాన్‌లో ఆ యువకుడు చాలా జూనియర్ స్థాయి ఉద్యోగిగా ఉన్నాడు.

Jack Teixeira
Jack Teixeira

ఈ జాబ్‌లో ఉండే వారు కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ను సేఫ్‌గా ఉంచడం, వ్యవస్థ సక్రమం పద్ధతిలో పని చేసేలా చూసుకోవడం, కంపెనీ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించడం లాంటివి వీరి విధులుగా నిర్దేశించారు. అయితే, ఆ యువకుడు ఎయిర్ నేషనల్ గార్డ్‌లో 2019లో చేరినట్లు తెలుస్తోంది. ఇలా కింది స్థాయి ఉద్యోగికి అత్యంత రహస్య సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వల్లనే ఇప్పుడు ఈ ఉపద్రవం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

Ram Charan: రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు ఫ‌స్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చెప్పిన ఉపాస‌న‌

-Advertisement-

ప్రెసిడెంట్స్ డైలీ బ్రీఫ్ మాజీ సీనియర్ ఎడిటర్ డెన్నిస్ వైల్డర్ దీనిపై స్పందించారు. ఇది పెంటగాన్‌కు పెద్ద సమస్యగా అభివర్ణించారు. ఇలాంటి పత్రాలను కింది స్థాయి సిబ్బందికి అందుబాటులో ఉంచడం క్షమించరాని నేరమన్నారు. మరోవైపు రహస్య పత్రాల లీక్ వ్యహారాన్ని తక్కువ చేసి చూపించేందుకు అగ్రరాజ్య అధినేత జో బైడెన్ ప్రయత్నిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఇదే విషయంపై మాజీ సైనికాధికారులు, నిపుణులు మరోలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్‌ను అగ్రరాజ్యం ఏవిధంగా సేకరిస్తోందనే విషయం తాజా పరిణామాలతో వెల్లడైందని చెబుతున్నారు.

రహస్య సమాచార పత్రాలను నిందితుడు ఆన్‌లైన్‌లో తన ఫ్రెండ్స్‌కు పంపినట్లు గుర్తించారు. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఐసొలేషన్‌ను తప్పించుకొనేందుకు ప్రయత్నాలు చేసిన టీనేజర్లు సైతం ఈ రహస్య సమాచారాన్ని అందుకున్నట్లు నిర్ధారించారు. ఈ ఘటన నేపథ్యంలో నిఘా వైఫల్యాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీటిని బైడెన్ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News