HomecinemaUpasana:మ‌ద‌ర్స్ డే వేళ బేబి బంప్ చూపిస్తూ అన్ని పుకార్ల‌కి చెక్ పెట్టిన ఉపాస‌న‌

Upasana:మ‌ద‌ర్స్ డే వేళ బేబి బంప్ చూపిస్తూ అన్ని పుకార్ల‌కి చెక్ పెట్టిన ఉపాస‌న‌

Telugu Flash News

Upasana: రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న మ‌రి కొద్ది రోజుల‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. అయితూ ఆమె ప్రెగ్నెన్సీ గురించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొంద‌రు ఆమె స‌రోగ‌సి ద్వారా బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌బోతుంద‌ని అనేక ప్ర‌చారాలు చేశారు. అయితే త్వ‌ర‌లో తల్లి కాబోతున్న ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టైం తన బేబీ బంప్ స్పష్టంగా రివీల్ చేశారు. బ్లాక్ టాప్ లో ఉపాసన బేబీ బంప్ హైలెట్ కావ‌డంతో ఆమె పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఉపాస‌న త‌న పోస్ట్‌కి కామెంట్‌గా.. సరైన సమయంలో తల్లిగా మారిన నేను ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అపరిమితమైన ప్రేమను నా బిడ్డకు ఇచ్చేందుకు నేను ఎమోషనల్ గా ప్రిపేర్ అయిన త‌ర్వాత‌నే గర్భం దాల్చాలని కోరుకున్నాను. నాకు పుట్టిబోయే బిడ్డ ప్రేమ, సంరక్షణకు, పోషణకు అర్హుడు/అర్హురాలు.. అని కామెంట్ పెట్టింది ఉపాస‌న‌. ప్ర‌స్తుతం ఉపాస‌న చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అంతేకాదు ఆమె పోస్ట్ గురించి ప‌లు డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి.

ఇక హీరో రామ్ చరణ్-ఉపాసన వివాహం చేసుకొని పదేళ్లు దాటిపోయిన విష‌యం తెలిసిందే. . వీరు చాలా ఆలస్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేయ‌గా, దీనిపై అనేక రూమ‌ర్స్ వ‌చ్చాయి. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భం దాల్చినట్లు చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఆ వార్త‌తో మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా వారసుడు వస్తున్నాడన్న వార్తను పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోంటూ ఎంతోమందికి అండ‌గా నిలుస్తూ వారి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటుంది.ఇక రామ్ చ‌ర్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కొద్ది రోజుల పాటు త‌న స‌తీమ‌ణి బాగోగులు చూసుకోబోతున్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News