Monday, May 13, 2024
HomenationalCBI Director: సీబీఐకి కొత్త డైరెక్టర్.. ఎవరీ ప్రవీణ్‌ సూద్‌ ?

CBI Director: సీబీఐకి కొత్త డైరెక్టర్.. ఎవరీ ప్రవీణ్‌ సూద్‌ ?

Telugu Flash News

CBI Director: దేశమంతా కర్ణాటక ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తున్న వేళ.. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి కొత్త బాస్‌ వచ్చారు. సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ సెలెక్ట్‌ అయ్యారు. ఈ మేరకు తాజాగా ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ప్రవీణ్‌ సూద్‌ను ఎంపిక చేశారు. చార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి రెండేళ్లపాటు ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది.

సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ రెండేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొన్నప్పటికీ ఈ పదవీ కాలాన్ని ఎక్స్‌టెన్షన్‌ చేసేకొనే వీలుంది. ఐదేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. 1986 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ ప్రవీణ్‌ సూద్‌.. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆయనకు ప్రమోషన్‌ లభించడం గమనార్హం. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌కుమార్‌ జైస్వాల్‌ రెండేళ్ల పదవీకాలం మే 25వ తేదీతో ముగుస్తోంది.

ఈ నేపథ్యంలో సీబీఐకి కొత్త డైరెక్టర్‌ నియామాకిని ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, లోక్‌సభలోని ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ నిన్న సమావేశమైందని, ఈ ముగ్గురి పేర్లను పరిశీలించి ఫైనలైజ్‌ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ముగ్గురిలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌, మధ్యప్రదేశ్‌ డీజీపీ సుధీర్‌ సక్సేనా, తాజ్‌ హసన్‌ల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. వీరి పేర్లను పరిశీలించిన అనంతరం ముందే ఊహించినట్లుగా కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్‌ సూద్‌ను సీబీఐకి కొత్త బాస్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

కర్ణాటక ఎన్నికల సందర్భంగా డీజీపీపై కాంగ్రెస్‌ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. ఎన్నికల టైమ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు, నేతలపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా డీజీపీ వ్యవహరిస్తున్నారని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.

అధికార పార్టీకి సపోర్ట్‌ చేస్తున్న డీజీపీపై చర్యలు తీసుకోవాలని డీకే శివకుమార్‌ ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాస్తామని కొన్నాళ్ల కిందట వ్యాఖ్యానించారు. తాము అధికారం చేపట్టిన వెంటనే డీజీపీపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. సీన్‌ కట్‌ చేస్తే అక్కడ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన మరుక్షణమే ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ డైరెక్టర్‌గా ప్రమోట్‌ కావడం విశేషం.

-Advertisement-

Read Also : Bypolls: దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News