Telugu Flash News

Uttar Pradesh : యూపీలో ఇద్దరు యువతుల ప్రేమ కథ.. ట్విస్టులు మామూలుగా లేవు !

Uttar Pradesh news  : ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు పెరిగిపోయాయి. అమ్మాయి-అబ్బాయి ప్రేమించుకోవడం కామనే. కానీ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు లవ్వాడటం సమాజం హర్షించదు. కానీ కొందరు ఇదే విధానం ఫాలో అవుతుంటారు. తాజాగా వెలుగు చూసిన ఘటనలో ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. కథలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడ సోనమ్‌ అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. సనా అనే యువతి వీరి ఇంట్లోకి పేయింగ్‌ గెస్ట్‌గా వచ్చింది. సనా, సోనమ్‌.. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్‌ ఏర్పడింది. అత్యంత వేగంగా ఇది ప్రేమగా మారిపోయింది. కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా సహజీవనం చేసే స్థితికి చేరుకున్నారు వీరిద్దరూ.

అయితే, వీరిలో సనా ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమెకు బదిలీ అయ్యింది. 2017 ఆగస్టు 10న తనకు కేటాయించిన క్వార్టర్స్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే, సహజీవనం చేస్తున్న పరిస్థితుల మధ్య ఎడబాటును సోనమ్‌ భరించలేకపోయింది. దీంతో నాలుగు రోజులకే సనా వద్దకు వెళ్లిపోయింది. తర్వాత కొన్నాళ్లకు సనాను మగాడిలా మారిపోవాలని సోనమ్‌ ప్రతిపాదన చేసింది. అనంతరం ఇద్దరూ ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రికి వెళ్లారు.

అసలు ట్విస్టులు షురూ..

సర్జరీ సందర్భంగా సనాకు భార్యని అంటూ సోనమ్‌ సంతకం చేసింది. తర్వాత 2020 జూన్‌ 22న సనా పేరును సోహైల్‌గా మార్చుకుంది. అనంతరం సోనమ్‌కు ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అనంతరం అక్కడే ఉన్న జ్ఞాన్‌ అనే యువకుడితో ప్రేమలో పడింది. దీంతో సోహైల్‌గా మారిన సనాను విడిచి వెళ్లిపోయింది. అంతేకాదు.. మగాడిగా మారిన సోహైల్‌ తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. దీంతో పోలీసుల ఎదుట సోహైల్‌ వాపోయాడు. అయినప్పటికీ తనకు న్యాయం జరగాల్సిందేనంటూ కోర్టుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. కథలో ట్విస్టులు ఇలా సంభవించాయి.

also read news:

Sourav Ganguly : గంగూలీ బయోపిక్‌కు వేగంగా అడుగులు.. హీరోగా ఎవరు నటిస్తున్నారంటే!

niharika konidela : త‌ల్లి కాబోతున్న నిహారిక‌… అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిందా..!

Exit mobile version