Viral Video: మంచిగా చదువుకోవల్సిన వయస్సులో కొందరు ప్రేమ, దోమ అంటూ బంగారు జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి పిల్లలని స్కూల్స్, కాలేజీలకు పంపిస్తుంటే వారు మాత్రం ప్రేమ మాయలో పడి తమ భవిష్యత్‌ని ప్రశ్నార్ధకంగా మార్చుకుంటున్నారు.
తాజాగా ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు కాళ్లతో, కర్రలతో దారుణంగా కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకోగా, ఇది చూసిన ప్రతి ఒక్కరు వీరు విద్యార్ధులా లేక వీది రౌడీలా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది.
వీధి రౌడీల్లా..
నర్సంపేట లోని ఒకేషనల్ కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నాదంటే నాదంటూ రోడ్డెక్కారు. ఆ హీరోల కోసం వారి సైన్యం కూడా రంగంలోకి దిగడంతో ఇదొక సినిమా షూటింగ్ మాదిరిగానే కనిపించింది.
సినీఫక్కీలో ఒకరినొకరు పట్టుకొని విపరీతంగా కొట్టుకోవడం, కర్రలు తీసుకొని మరీ దాడులు చేసుకుంటుండడంతో అందరు బిత్తరపోయారు. రెండు రోజుల క్రితం కూడా వారిద్దరూ కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఆ సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఇరువురు అక్కడి నుండి పారిపోయారు.
మరోవసారి వారు కొట్టుకోగా, వారి ఫైటింగ్ చూసిన జనాలు భయబ్రాంతులకి గురయ్యారు. ఇక ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఇద్దరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదటిసారి గొడవ అయినప్పుడే గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, అప్పుడు వదిలేసినందుకే ఇలా చేశారని వారు మండిపడుతున్నారు. ఒక అమ్మాయి కోసం రోడ్డుకి ఎక్కి మరీ తన్నుకుంటున్న వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం అందరికి షాకింగ్‌గా మారింది.
అమ్మాయికోసం పబ్లిక్ గా బస్టాండులో ఘోరంగా కొట్టుకున్న యువకులు#Youngmen #Fight #Girl pic.twitter.com/taXJsJQAjs
— oneindiatelugu (@oneindiatelugu) September 24, 2022