HometelanganaTSPSC group 1 : గ్రూప్‌ 1 మెయిన్స్‌లో మార్పులు.. ఛాయిస్‌ తగ్గించేశారు!

TSPSC group 1 : గ్రూప్‌ 1 మెయిన్స్‌లో మార్పులు.. ఛాయిస్‌ తగ్గించేశారు!

Telugu Flash News

TSPSC group 1 : తెలంగాణలో గ్రూప్‌ 1 పరీక్షల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న విధానాల్లో కాస్త మార్పులు చేర్పులు చేపట్టింది టీఎస్‌పీఎస్సీ. ఇందులో భాగంగా గ్రూప్‌ 1 పరీక్షల విధానంలో కీలక ఛేంజెస్‌కు తెరతీసింది. గత విధానాలకు భిన్నంగా ఈసారి ఆప్షన్లను గణనీయంగా తగ్గించేశారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఛాయిస్‌ను తగ్గించడంతో ప్రిపరేషన్‌లోనూ మార్పులు చేసుకోవాల్సి వస్తోందని పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు.

మొన్నటిదాకా ఉన్న ఇంటర్వ్యూల విధానం ఎత్తేయడంతో ఇక అభ్యర్థుల సామర్థ్యాన్ని కాస్త ఎక్కువగా మదింపు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి కొన్ని మార్పులకు కమిషన్‌ శ్రీకారం చుట్టింది. గ్రూప్‌ 1 ఎగ్జామ్స్‌కు గతంలో 5 పేపర్లు ఉండేవి. అయితే, దీన్ని ఈసారి ఆరు పేపర్లకు మార్చారు. అదనంగా ఓ పేపర్‌ యాడ్‌ అయింది. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తంగా 900 మార్కులను కమిషన్‌ కేటాయించింది.

ఇక జనరల్‌ ఎస్యే పేపర్‌ 1లో పెద్దగా మార్పులు చేయలేదు. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ సబ్జెక్టులున్న పేపర్ 2, భారత సమాజం, రాజ్యాంగం, పరిపాలన అంశాలున్న పేపర్‌ 3, ఎకానమీ, డెవలప్‌మెంట్‌ సబ్జెక్టులున్న పేపర్‌ 4లలో ప్రశ్నలకు ఆప్షన్లలో కోత విధించింది కమిషన్‌. ప్రస్తుతం ఆప్షన్లతో కలిపి ఒక్కో విభాగంలో 8 చొప్పున మొత్తం 24 క్వశ్చన్స్‌ మాత్రమే ఉంటాయి. ప్రతి విభాగంలో మొదటి రెండు ప్రశ్నలకు ఆన్సర్స్‌ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. 3, 4, 5 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్న అదనంగా ఇస్తారు. ఇందులో మాత్రమే ఛాయిస్‌ను ఇచ్చారు.

TSPSC group 1 ప్రశ్నపత్రం పూర్తిగా మారింది..

మరోవైపు పేపర్ 4, 5గా గతంలో ఉన్న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాలను కలిపి ఇప్పుడు పేపర్‌ 5 గా మార్పు చేశారు. క్వశ్చన్‌ పేపర్‌ కూడా పూర్తిగా మారిపోయింది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సబ్జెక్టును రెండు సెక్షన్లుగా ఇస్తారు. ఒక్కో సెక్షన్‌లో పది చొప్పున క్వశ్చన్స్‌ ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో మొదటి రెండు ప్రశ్నలకు తప్పనిసరిగా ఆన్సర్‌ రాయాలి. 3, 4, 5 ప్రశ్నలకు ఒక్కో అదనపు క్వశ్చన్‌ చొప్పున ఆప్షన్‌ వస్తుంది. రెండు సెక్షన్లలో కలిసపి మొత్తం పది ప్రశ్నలకు ఆన్సర్లు రాయాలి. మూడో సెక్షన్‌లోని డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 30 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 25 క్వశ్చన్స్‌కు జవాబులు రాయాల్సి ఉంటుంది.

also read:

Govt Old Vehicles : 15 ఏళ్లు నిండిన ప్రభుత్వ వాహనాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్‌ 1 నుంచే అమలు!

-Advertisement-

Byreddy Siddartha Reddy : పవన్‌కు 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా? తెలంగాణలోనూ జగన్‌కు లక్షల మంది ఫ్యాన్స్‌.. బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News