HometelanganaTSPSC : నాలుగో రోజు విచారణలో మరిన్ని ఆధారాలు.. రాజశేఖర్‌ ఇంట్లో ప్రశ్నపత్రాలు స్వాధీనం!

TSPSC : నాలుగో రోజు విచారణలో మరిన్ని ఆధారాలు.. రాజశేఖర్‌ ఇంట్లో ప్రశ్నపత్రాలు స్వాధీనం!

Telugu Flash News

టీఎస్‌పీఎస్సీ (TSPSC) క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ కేసు దర్యాప్తును అధికారులు స్పీడప్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న నిందితులను నాలుగో రోజు విచారణ చేశారు. సిట్‌ అధికారులు నిందితులను విచారించారు. ఈరోజు దర్యాప్తులో పలు కీలక ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.

ఎగ్జామ్ రాసిన గోపాల్‌, నీలేష్‌కు నీలేష్‌ సోదరుడు రాజేంద్ర నాయక్‌ నగదు సమకూర్చినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేతావత్‌ శ్రీనివాస్‌ ద్వారా మరికొంత డబ్బులు ఇప్పించినట్లుగా అధికారులు సమాచారం సేకరించారు.

ఇక బడంగ్‌పేట్‌లోని ప్రవీణ్‌ నివాసంలో నిన్న సిట్‌ అధికారులు తనిఖీలు చేశారు. మణికొండలోని రాజశేఖర్‌రెడ్డి నివాసంలో తనిఖీల సందర్భంగా మరికొన్ని ప్రశ్నపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సిట్‌ అధికారులు వెల్లడించారు. ఈనెల 5వ తేదీన నీలేష్‌, గోపాల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష రాశారు.

tspsc paper leak newsపేపర్‌ ఇచ్చినందుకు ఇద్దరు అభ్యర్థులు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ద్వారా 14 లక్షల రూపాయలు సమకూర్చారని సిట్‌ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందతురాలు రేణుకతో పాటు ఆరుగురిని హిమాయత్‌ నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి తరలించి విచారణ జరిపారు.

ప్రశ్నపత్రాల లీకేజీ స్కామ్‌ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డులో గందరగోళం ఏర్పడింది. మరోవైపు అభ్యర్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనలో పడ్డారు. దీనికి తోడు రాజకీయ నేతలు సైతం తమ స్వార్థ ప్రయోజనాల కోసం రకరకాలుగా మాట్లాడుతుండడం కాకరేపుతోంది.

ఈ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి స్వయంగా దృష్టి సారించారు. అసలేం జరిగిందనే విషయంపైన వాకబు చేస్తున్నారు. విచారణ దశలో ఉన్నందున ప్రస్తుతం ఆయన మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

-Advertisement-

రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ అనేక సార్లు పరీక్షలు నిర్వహించింది. అయితే, ఏ రోజూ పరీక్షల నిర్వహణలో విఫలం కాలేదు. అయితే, ఇప్పుడు ఏకంగా పరీక్ష పేపర్‌ లీక్‌ కావడం అనేది టీఎస్‌ పీఎస్సీకి మాయని మచ్చగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు టీఎస్‌పీఎస్సీలో పని చేసే ఇద్దరు దొంగలు ఇలా పేపర్‌ లీక్‌ చేయడం ద్వారా మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది రాజకీయ రంగు పులుముకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Also Read :

ఇండియాలో ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్

Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావుపై అసత్య ప్రచారాల వెనుక ఆ రాజకీయ నేత అభిమానులు?!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News