HometelanganaTRS MLAs poaching case : హైకోర్టులో ఎరకేసు వాదనలో హై డ్రామా...

TRS MLAs poaching case : హైకోర్టులో ఎరకేసు వాదనలో హై డ్రామా…

Telugu Flash News

TRS MLAs poaching case : ఇటీవల హైదరాబాద్ నగర శివారు ప్రాంతం మొయినాబాద్‌ మండలానికి చెందిన అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు వారిని సంప్రదించి పార్టీ మారితే ఒక్కొక్కరికీ సుమారుగా రూ.100 కోట్లు ఇస్తామని ఆశచూపించారని…దీంతో పాటే వారికి కాంట్రాక్టులు ఇప్పిస్తామని మాటలు చెప్పి పార్టీనీ మారేలా చేయడానికి ప్రయత్నించారని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు,రేగా కాంతారావులు ఆరోపించడంతో ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌, తిరుపతికి చెందిన సింహ యాజులు మరియు రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు లో విచారణ జరుగుతుండగా బీజేపీ(BJP) తరుపున వాదిస్తున్న న్యాయవాది దామోదర్ రెడ్డి తన వాదనలో బీజేపీ(BJP) ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ కూల్చలేదని,ఏ ఎమ్మెల్యేనూ కొనే ప్రయత్నం చేయలేదనీ అన్నారు.సీఎం కేసీఆరే చాలా సందర్భాలలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌(TRS) లో చేరమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారనీ ఆయన చెప్పుకొచ్చారు.దీనికి ఉదాహరణగా 2014 నుంచి 2018 వరకు 37 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన సంఘటనే తీసుకోమని న్యాయవాది దామోదర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు.


మరోపక్క బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య కోర్టులో వాదనలు ఎందుకని,బీజేపీ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ డిస్మిస్ చేసినప్పుడు ఈ అప్పీల్‌లో మీ వాదనలు ఎందుకని న్యాయ స్థానం ప్రశ్నించగా…తమ పార్టీ ప్రతిష్టను రోడ్డుకు లాగే విధంగా సిట్ తరుపు న్యాయవాది దవే వాదించారని, దానికి సమాధానం ఇవ్వడానికి మాత్రమే తాను రాజకీయాల ప్రస్తావన తెచ్చాననీ బీజేపీ తరపు న్యాయవాది దామోదర్‌రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ కేసును సీబీఐకి (CBI) ఇవ్వడానికి 45 అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రెస్‌మీట్‌ను కూడా హైకోర్టు ఆర్డర్‌లో చేర్చడంతో పాటు సిట్‌ ఉనికిని హైకోర్ట్ న్యాయ స్థానం ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థ తన హద్దులను దాటి ప్రవర్తించిందని హైకోర్టు అభిప్రాయపడింది.

సిట్‌ ఘోరంగా విఫలం

అదే విధంగా కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్‌ చేయడంపై హైకోర్టు మండిపడింది. కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్‌ ఘోరంగా విఫలమైందని హైకోర్ట్ చెప్పుకొచ్చింది సిట్‌ దర్యాప్తు సరిగ్గా చేసినట్టు తమకు అనిపించట్లేదని హైకోర్టు తేల్చి చెప్పేసింది.సిట్‌ చేసిన దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు 455/2022 ఎఫ్ఐఅర్ ను సీబీఐకి బదిలీ చేసింది.

అయితే ఈ కేసులో వివరాలను తమకివ్వమంటూ ప్రభుత్వానికి లేఖ రాసామనీ.. వివరాలు ఇస్తే తాము విచారణ చేస్తామని సీబీఐ హై కోర్టుకి తెలిపింది.ఈ కేసుకు సంబంధించిన వివరాలను తమకు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని సీబీఐ కోర్టును కోరింది.

సీబీఐ మనవికి హైకోర్టు సమాధానం ఇస్తూ ప్రస్తుతం కేసు విచారణలో ఉందనీ…సీబీఐని వేచి ఉండమని హై కోర్టు సూచించింది.ఆపై ఈ సోమవారం సీబీఐ వాదనలు వింటామన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

-Advertisement-

also read: 

David Warner: రిటైర్మెంట్ ఆలోచ‌న‌లో డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాల్లోకి రాబోతున్నాడా..!

AP News : కందుకూరులో కుట్ర జరిగిందా? చంద్రబాబు సంచలన ఆరోపణలు!

Telangana News : బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 45 మంది ప్రయాణికులను కాపాడి తాను కన్నుమూశాడు!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News