HomecinemaTom Holland about RRR Film : భారత పర్యటన, RRR అద్భుతం.. స్పైడర్ మ్యాన్ కామెంట్స్.. వీడియో వైరల్

Tom Holland about RRR Film : భారత పర్యటన, RRR అద్భుతం.. స్పైడర్ మ్యాన్ కామెంట్స్.. వీడియో వైరల్

Telugu Flash News

Tom Holland about RRR Film : ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే . భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ కి అద్బుతమైన రెస్పాన్స్ లభించింది.

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమా కి ఫిదా అయ్యారు. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఇది 1000 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ప్రపంచ ప్రముఖులు, హాలీవుడ్ దర్శకుల ప్రశంసలు ఈ సినిమా అందుకుంది.

అలాగే ఈ సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకొని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమాపై హాలీవుడ్ నటీనటులు ప్రశంసలు కురిపించగా.. తాజాగా స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హాలండ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఇటీవల ముంబైలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం టామ్ హాలండ్ ఇండియా వచ్చారు. మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తావన వచ్చింది. “భారత పర్యటన నాకు చాలా మంచి జ్ఞాపకాలను ఇచ్చింది. సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు.

అది ఒక మరిచిపోలేని అనుభవం. ఆ ట్రిప్‌ని జీవితంలో మర్చిపోలేను. మళ్లీ ఇండియా వెళ్లాలనుకుంటున్నాను. మూడు రోజుల్లో చాలా మంది ప్రముఖులను కలిశాను. ఒక్క మాటలో చెప్పాలంటే భారత పర్యటన అద్భుతం. హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ కూడా చూశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. చాలా బావుంది’’ అని అన్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

read more news :

-Advertisement-

RRR: నాటు నాటు పాట‌కి విరాట్ కోహ్లీ అదిరిపోయే స్టెప్స్.. వీడియో షేర్ చేసిన ఆర్ఆర్ఆర్ టీం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News