టామ్ క్రూస్ (Tom Cruise) ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు కలిగిన యాక్షన్ హీరో,ఏ నటుడూ కలలో కూడా ఊహించనంత పారితోషికం తీసుకుని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసిన సూపర్ స్టార్.అటువంటి వ్యక్తి,గొప్ప నటుడు అయిన టామ్ క్రూస్ గురించి తెలియాలంటే ఇది చదవాల్సిందే.
1962,జులై 3న న్యూయార్క్ లోని సిరక్యూస్ లో ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన తోమస్ క్రూస్ మాపోధర్ కి జన్మించాడు టామ్ క్రూస్.
టామ్ ఇద్దరు అక్కలు ఒక చెల్లితో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుండే వాడట.అయితే తన తండ్రి తోమస్ క్రూస్ వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించకపోవడం,ఎప్పుడూ టామ్ ను తన ఇద్దరు అక్కల్ని,చెల్లిని కొడుతూ,వాళ్ళ తల్లిని కూడా హింసిస్తుండడంతో బరించలేక తన తండ్రి నుంచి విడిపోయి తన పిల్లల్ని తీసుకుని వేరుగా వచ్చేసిందట టామ్ తల్లి.
పుట్టుకతోనే క్రిస్టియన్ అయిన క్రూస్ ఆనందంగా గడిపిన రోజులకంటే పేదరికంతో బాధపడిన రోజులే ఎక్కువ. చిన్నతనంలో స్కూల్లో చదువుతున్న రోజులలోనే చిన్న చిన్నగా డ్రామాలు వేయడం మొదలుపెట్టిన టామ్ ఎప్పుడూ నటనపై ఆసక్తితోనే ఉండే వాడట.
తను స్కూల్లో చేరి చదువును ముగించుకున్న 14 సంవత్సరాలలో దాదాపు గా 15 స్కూల్ లు మారిన క్రూస్ కి చిన్న తనం నుంచే తన తల్లిదండ్రులు స్పెషల్ స్కూల్ చెప్పించేవారట.
చిన్నప్పటి నుంచి నటనపై టామ్ కి అసక్తి ఉన్నపటికీ ఫ్రాన్సిస్కాన్ ప్రీస్ట్ అవ్వాలని నిర్ణయించుకున్న టామ్ తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తరువాత కాథలిక్ చర్చ్ స్కాలర్ షిప్ తీసుకుని సెయింట్ ఫ్రాన్సిస్ సెమినరీలో చేరాడు.
అయితే కొన్ని సందర్బాలలో టామ్ తాగి కనిపించడంతో ప్రీస్ట్ కాకుండానే సెమినరీ నుంచి బహిష్కరించబడ్డాడు.ఇదే కాకుండా చాలా సార్లు టామ్ మందుకు బానిసై తాగుతూ కనిపించడంతో చాలా అవకాశాలని కోల్పోయాడు.
సినీ ప్రయాణం:
1980లో 18 ఏళ్ల వయసున్నప్పుడు తన తల్లి,సవతి తండ్రి నటనపై అసక్తి చూపమని,సినిమాలలో తన అదృష్టాన్ని పరిక్షించుకోమని చెప్పడంతో క్రూస్ యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులు వేశాడు.
అలా సినిమాలలోకి వెళ్లిన టామ్ 1981లో ఎండ్ లెస్ లవ్,ఆల్ ది రైట్ మూవ్స్ లాంటి సినిమాలలో కొన్ని చిన్న చిన్న పాత్రలలో కనిపించగా 1983లో విడుదలైన రిస్కీ బిజినెస్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు.
ఆ తరువాత 1986లో విడుదలైన టాప్ గన్ సినిమాతో అందర్నీ ఆకట్టుకునే పాత్రతో యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు.
అలా ప్రధాన హీరోగా తన ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండి వివిధ రకాల సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న టామ్ జాక్ రీచర్,ది లాస్ట్ సమురాయ్,ఎ ఫ్యూ గుడ్ మెన్,మిషన్ ఇంపాసిబుల్ సీరీస్ లాంటి మరిచిపోలేని అనుభూతిని కలిగించే సినిమాలను ప్రేక్షకులకు అందించి యెనలేని అభిమానాన్ని పొందాడు.
క్రూస్ తన సినిమాలతో ప్రేక్షకులలో ఎంత అభిమానాన్ని పొందాడంటే ఆయన సినిమాలు ఎలా ఉన్నపటికీ జనం టామ్ క్రూస్ ని మాత్రమే చూడడానికి సినిమాలకు వచ్చేవారట.
1997 నుంచి 2000 వరకు వరుసగా మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు,రెండు సార్లు ఎంటీవీ(MTv) బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డులు అందుకుని ప్రతి సినిమాతో అంచెలాంచలుగా ఎదుగుతూ వచ్చాడు.
టామ్ ఇటీవలే విడుదలైన టాప్ గన్ మావేరిక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఈ ఏడాదిలో విడుదలైన తన సినిమాలకు రెమ్యునిరేషన్ గా వంద మిలియన్ల యూఎస్ డాలర్లు అందుకుని ప్రపంచంలోనే అధిక పారితోషికం తీసుకున్న నటుడిగా చరిత్ర సృష్టించాడు.
also read news:
Sachin: సచిన్ కూతురు కొత్త ప్రయత్నాలు.. ఎందుకలా తిట్టేస్తున్నారు..!
Anupama Parameswaran photos at 18 Pages Movie Pre Release Event