Homecinemaదువా లిపా కన్సర్ట్‌: టాలీవుడ్ స్టార్‌ సెలబ్రిటీల కూతుళ్ల సందడి

దువా లిపా కన్సర్ట్‌: టాలీవుడ్ స్టార్‌ సెలబ్రిటీల కూతుళ్ల సందడి

Telugu Flash News

ప్రపంచ ప్రసిద్ధ పాప్ స్టార్ దువా లిపా తన సంగీతంతో మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈసారి ముంబైలో ఆమె కన్సర్ట్‌కి వచ్చిన ప్రేక్షకుల మధ్య టాలీవుడ్ స్టార్ కుటుంబాల సభ్యులు కూడా ఉన్నారు.

మహేశ్ బాబు కూతురు సితార, వంశీపైడి పల్లి, సుకుమార్ కుమార్తెలు సుకృతి, ఆద్యలు దువా లిపాను కలిసి ఫోటోలు దిగారు. ఈ అరుదైన అవకాశంపై వారు ఎంతో ఆనందించారు. వారితో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్, ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమల్ వంటి ప్రముఖులు కూడా ఈ కన్సర్ట్‌కి హాజరయ్యారు.

2019లో దువా లిపా తొలిసారి ఇండియాలో కన్సర్ట్‌ ఇచ్చింది. ఈసారి ఆమె రెండోసారి ఇండియా వచ్చిన సందర్భంగా ఈ కన్సర్ట్‌ నిర్వహించబడింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News