Today Weather Report : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం తెలిపింది.
హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్లో గురువారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
also read :
Horoscope Today in Telugu: నవంబర్ 10, 2023 ఈ రోజు రాశి ఫలాలు