HomehoroscopeToday Horoscope Telugu (16-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Today Horoscope Telugu (16-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 16th february 2024: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Aries horoscope

మేషరాశి వారికి ఈ రోజు ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పనుల యందు చికాకులు, మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రాశి వారు ఈ రోజు గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం మంచిది. మేష రాశి ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ, ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాలు కలిగే అవకాశం ఉంది. మహిళలు ఈ రోజు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Taurus horoscope

వృషభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పౌరుషం, పట్టుదల వంటివి ఈ రోజు మీకు ఇబ్బందులు తెస్తాయి. స్నేహితులతో భేదాభిప్రాయాలు, వాగ్వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Gemini

మిథున రాశి వారికి ఈ రోజు కుటుంబంలో వివాదాలు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు, వేదనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించగలరు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Cancer horoscope

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులకు ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. స్త్రీలు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలని సూచన.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Leo

సింహ రాశి వారికి ఈ రోజు గురుని ప్రభావం వల్ల ఆరోగ్యం, కుటుంబం విషయాలలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సింహరాశి వారు మరింత శుభఫలితాలను పొందడానికి లక్ష్మీ అష్టకాన్ని పఠించాలి.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Virgo

కన్యారాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి పని అనుకూలంగా జరుగుతుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. మీరు అనుకున్న ప్రతి పనిని ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. శని, శుక్రుల ప్రభావం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిని మీరు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ధన సంబంధించిన విషయాలు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీ ఒత్తిళ్ళు తగ్గుతాయి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Libra horoscope

తులారాశి వారికి ఈ రోజు చేసే పనులలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మిగతా గ్రహాల అనుకూల స్థితి వల్ల తులారాశి వారు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Scorpio

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులను ఈ రోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉ న్నప్పటికీ, అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. స్త్రీలకు ఈ రోజు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Saggitarius

ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు శుభప్రదంగా జరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు, ఉద్యోగులకు ఉద్యోగంలో అనుకూలత కలుగుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు మధ్యస్థ సమయం. ధనూరాశి వారికి ఈ వారం ధన లాభం, సౌఖ్యం కలుగుతుందని సూచనలు ఉన్నాయి. ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Capricorn horoscope

మకరరాశి వారు ఈ రోజు గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉండే అవకాశం ఉంది. నాల్గవ ఇంట్లో రాహువు సంచారం వల్ల కొంత చికాకు ఏర్పడవచ్చు. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడానికి మకరరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Aquarius

కుంభరాశి వారికి ఈ రోజు అంతగా అనుకూలంగా ఉండదు. మానసిక ఒత్తిళ్ళు, వేదనలు అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అప్పు పుట్టే అవకాశం ఉంది. ద్వితీయ స్థానంలో గురువు ఉన్నందున కుటుంబ వ్యవహారాలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఏదో రకంగా ముందుకు సాగగలుగుతారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2024 Pisces horoscope

మీన రాశి వారికి ఈ రోజు అంతగా అనుకూలంగా ఉండదు. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికంగా ఉండే అవకాశం ఉంది. ధనపరమైన వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండడం మంచిది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News