today horoscope in telugu : ఈ రోజు రాశి ఫలాలు 31-05-2023 తేదీన మీ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Aries horoscope
ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా ముందడుగు వేసే అవకాశం ఉంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం దక్కుతుంది. అనారోగ్యం నుండి బయటపడే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Taurus horoscope
ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ అప్పులు ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ చేయకుండా ఉండాలి. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Gemini
ఈ రాశి వారికి ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి తప్పక కనిపిస్తోంది. ఐటి తదితర నిపుణులు ప్రమోషన్లు అందుకునే ఛాన్స్ ఉంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Cancer horoscope
ఈ రాశి వారికి అవసరానికి తగినట్టుగా చేతికి డబ్బు అందుతుంది. రుణ సమస్య చాలావరకు తగ్గే అవకాశం ఉంది. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను క్రమంగా పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలలో కొన్ని చికాకులు ఎదురవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Leo
ఈ రాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారుల నుంచి కొంత అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ రంగానికి చెందిన వారికి మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మనసు లోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Virgo
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొన్నిప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు మందకోడిగా సాగే ఛాన్స్ ఉంది.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Libra horoscope
ఈ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరిగి కొంత ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగం ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Scorpio
ఈ రాశి వారికి బంధుమిత్రుల సహాయంతో ఓ ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Saggitarius
ఈ రాశి వారికి అధికార యోగానికి అవకాశం ఉంది. బందు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది.ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.శుభ వార్తలు ఎక్కువగా వింటారు.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Capricorn horoscope
ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలను గడించడం జరుగుతుంది.ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేసే అవకాశం ఉంది.. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Aquarius
ఈ రాశి వారికి అనుకోకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. విపరీతంగా ఒత్తిడి ఉన్నా పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేసే ఛాన్స్ ఉంది. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు శుభవార్తలు మీ చెవిన పడే అవకాశం ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు may 31, 2023 Pisces horoscope
ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు నిలకడగా ఉంటాయి. బంధుమిత్రుల కారణంగా ఒకటి రెండు చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకువచ్చి ఇస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
read more news :
Sujana Chowdary: సుజనా చౌదరికి ఝలక్.. మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు!
Ruturaj Gaikwad: కాబోయే భార్యను పరిచయం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. పెళ్లి తేదీ కూడా ఫిక్స్!
MLA Raghunandan Rao: రఘునందన్‌రావుకు లీగల్ నోటీసు.. వెయ్యికోట్ల పరువు నష్టం దావా!
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు నాలుగో భార్య కావడానికి సిద్ధం.. యూకే టిక్‌టాకర్ ప్రపోజల్