Homehoroscopetoday horoscope in telugu : 28-05-2024 ఈ రోజు రాశి ఫలాలు

today horoscope in telugu : 28-05-2024 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

today horoscope in telugu : 28-05-2024 ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేష రాశి :

ఈ రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.. కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వివాదాల‌కు దూరంగా ఉండ‌డం చేయాలి.

వృషభ రాశి :

ఈ రాశి వారు కొంత ఖర్చులు నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.. స్త్రీలు కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించ‌డం మంచిది. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు క‌లిగే అవ‌కాశం ఉంది.

మిథున రాశి :

ఈ రాశి వారికి ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ‌గా ఉండును. ఆర్ధిక విషయాలు బాగానే అనుకూలించును. పనులు యందు ఆటంకములు, చికాకులు కలుగుతాయి. విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం చేయ‌డం మంచిది.

కర్కాటక రాశి :

ఈ రాశి వారికి ఖర్చులు అధికమగును. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉంటుంది.. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అనుకున్న పనులు స‌కాలంలో పూర్తి చేసెదరు. కుటుంబ విషయాల యందు జాగ్రత్త వహించ‌డం మంచిది.

సింహ రాశి :

ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా క‌లిసి వ‌స్తాయి. శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం చేయ‌డం చాలా మంచిది. బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు క‌ల‌గడం జ‌రుగుతుంది.

-Advertisement-

కన్య రాశి :

ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ఖర్చులు నియంత్రించుకోవ‌డం మంచిది. కుటుంబ విషయాలు అనుకూలిస్తాయి..ఈ రాశి వారికి ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించ‌డం వ‌ల‌న శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి.

తులా రాశి :

ఈ రాశి వారు అనుకున్న స‌మ‌యంలో అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ముఖ్యమైన విషయాల కోసం ధనాన్ని సమయాన్ని వినియోగిస్తారు.ఈ రాశి వారు విష్ణు సహస్రనామపారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలిగే అవ‌కాశం ఉంది.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారికి పని ఒత్తిడి రాజకీయ ఒత్తిడి అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ విషయాల యందు కొంత జాగ్రత్త వహించాలి. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహిస్తే బాగుంటుంది.

ధనుస్సు రాశి :

ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితము. వ్యాపారస్తులకు చెడు ఫలితము క‌నిపిస్తుంది. విద్యార్థులకు ఈరోజు బాగా అనుకూలించును. శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం చేస్తే బాగుంటుంది.

మకర రాశి :

ఈ రాశి వారికి రాజకీయ ప్రభావము ఉద్యోగస్తుల మీద అధికముగా ఉంటుంది.. వ్యాపారస్తులకు అనుకూల ఫలితములు క‌లుగును. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉంటుంది.. స్త్రీలకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

కుంభ రాశి :

ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. రాహువు అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం వల్ల శుభఫలితాలు క‌లిగే అవ‌కాశం ఉంది.. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవ‌డం ఉత్త‌మం.

మీన రాశి :

ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు వ్యాపారంలో సమస్యలు అధికముగా ఉండే అవ‌కాశం ఉంది.. స్త్రీలు ఈరోజు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం వంటివి చేయండి.

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News