HomeSpecial StoriesThomas Alva Edison : థామస్ అల్వా ఎడిసన్ జీవిత చరిత్ర, ఆవిష్కరణలు తెలుసుకోండి..

Thomas Alva Edison : థామస్ అల్వా ఎడిసన్ జీవిత చరిత్ర, ఆవిష్కరణలు తెలుసుకోండి..

Telugu Flash News

‘మేధావి తనానికి ఒక శాతం ఇతరుల ప్రభావమైతే 99 శాతం కృషి ఫలితం’ అన్న మేధావి థామస్ ఆల్వా ఎడిసన్ (Thomas Alva Edison). 1847లో అమెరికాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చదువుల్లో మొద్దు. కాని ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వమతనిది. ఎప్పుడూ ఏవో ప్రయోగాలు చేసేవాడు. చాలా నిరాశాజనకాలే.

ఇతడు ఒకసారి స్టేషన్ మాస్టర్ కొడుకుని ప్రమాదం నుండి రక్షించగా అతడు టెలిగ్రాప్ పని చేయించే విధానం నేర్పాడు. టెలిగ్రాఫ్ ఆపరేటర్గా అమెరికా అంతా ప్రయాణించాడు. అలా పనిచేస్తూ దాచుకొన్న సొమ్ముతో ఒక ప్రయోగశాలను నిర్మించుకున్నాడు. దానిలో ధ్వని రికార్డర్, ప్రింటింగ్ టెలిగ్రాఫ్ తయారు చేశాడు. 1000 ప్రయోగాలు చేశాడు.

ఆ తర్వాత విద్యుత్ బల్బ్ తయారు చేశాడు. 1882లో విద్యుత్ స్టేషన్ నిర్మించి న్యూయార్క్ నగరంలో కొన్ని ఇళ్లకు విద్యుత్తు సరఫరా చేసి కృతకృత్యుడయ్యాడు. 1893లో సినిమా ప్రొజెక్టర్; 1899లో వెలిగే దీపం కనుగొన్నాడు.

మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పనిచేశాడు. తన జీవిత చివరి దశలో సొంత టాకీలు కూడా నిర్మించాడు. ఇతడి ఆవిష్కరణలు మానవజీవితాన్ని సుఖవంతం చేశాయి. “నేను మానవుల్ని నాశనం చేసే ఆవిష్కరణలు చేయనని వారిని సంతోషంగా వుంచేవే కనుగొంటాను.”అన్న మానవతావాది. ఎడిసన్ 1922లో మరణించాడు.

also read :

palak pulav recipe : పాలక్ పులావ్ గ్రీన్ రైస్ పోషకాలు పుష్కలం

-Advertisement-

China Vaccine : చైనా వ్యాక్సిన్‌లో పస లేదు.. నియంత్రణలోకి రాని కరోనా.. మాకొద్దంటూ పలు దేశాల రిజెక్ట్‌!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News