HometelanganaBandi Sanjay : బండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం.. రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం

Bandi Sanjay : బండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం.. రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం

Telugu Flash News

కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్‌ నేత, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఎన్నికల వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా బండి సంజయ్‌ పలుమార్లు క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు గైర్హాజరయ్యారు. తాజాగా ఆయన మరో గడువు కోరడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున మరో గడువు ఇవ్వాలని బండి సంజయ్ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. ఎన్నికల పిటిషన్లపై ఆరు నెలల్లోగా తీర్పు వెలువడాల్సి ఉన్నందున విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ గత జూలై 21 నుంచి మూడుసార్లు కోర్టును ఆశ్రయించారు.

బండి సంజయ్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 12వ తేదీన హాజరవుతారని లాయర్ తెలిపారు. దీంతో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News