Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. తెలంగాణ బరిలో నిలిచిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనున్నారు.
అల్లు అర్జున్ గంటకు పైగా క్యూలో
టాలీవుడ్ నుంచి పులువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా హీరో సుమంత్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటును వినియోగించుకున్నాడు. బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153 వద్ద అల్లు అర్జున్ ఓటు వేశాడు.
వాస్తవంగా ఓటేసేందుకు ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నది బన్నీనే.. ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు ఆయన చేరుకున్నాడు. ఆయన క్యూ లైన్‌లో ఉండగా కొంత సమయం పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అల్లు అర్జున్ గంటకు పైగానే క్యూ లోన్లోనే నిల్చున్నాడు.
#AlluArjun arrived at the polling booth to cast his vote.#GultePaps #TelanganaElections2023 #TelanganaAssemblyElections pic.twitter.com/1AzozFDtdk
— Gulte (@GulteOfficial) November 30, 2023
జూ. ఎన్టీఆర్ కుటుంబం కూడా
జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో జూ. ఎన్టీఆర్ కుటుంబంతో సహా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తారక్‌తో పాటు తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు అమ్మగారు షాలిని ఉన్నారు. వారందరూ కూడా క్యూ లైన్లో నిల్చోని ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. యువత అందరూ నేడు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చాడు.
#TFNExclusive: Visuals of @tarak9999 along with his mother & wife near polling booth as they go to cast their votes 🗳️ #TelanganaElections2023 #JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/jSLMzarts7
— Telugu FilmNagar (@telugufilmnagar) November 30, 2023
Megastar @KChiruTweets and family came to cast their vote. 🗳️#Megastar #MegastarChiranjeevi #Mega156 #TelanganaElections2023 #Elections2023 pic.twitter.com/HGB0GXTojy
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 30, 2023