HometelanganaKCR : అన్నదాతలకు గుడ్‌ న్యూస్.. ఎకరాకు రూ.10 వేలు, గంటలోనే మంజూరు!

KCR : అన్నదాతలకు గుడ్‌ న్యూస్.. ఎకరాకు రూ.10 వేలు, గంటలోనే మంజూరు!

Telugu Flash News

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) ఇటీవల కురిసిన వర్షాలు, వడగండ్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. హెలికాప్టర్‌ ద్వారా అధికారులు, మంత్రులతో కలిసి ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం జిల్లాలోని బోనకల్‌ మండలానికి వెళ్లిన కేసీఆర్.. అక్కడ రావినూతల గ్రామానికి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో పాడైపోయిన పంటలను చూశారు. పంట పొలాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద దిగి రైతులను, వ్యవసాయ శాఖ అధికారులను కేసీఆర్ కలుసుకున్నారు.

వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల నష్టం గురించి రైతులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారు? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలను అడిగారు. గార్లపాడు మార్గంలో నేలవాలిన పంటను పరిశీలించిన కేసీఆర్.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారని, సొంత పొలాన్ని పండించుకొనే రైతులతో పాటు కౌలు రైతులను కూడా తప్పనిసరిగా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాశ చెందవద్దని ధైర్యం చెప్పారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధులను ఓ గంటలోపే విడుదల చేయాలని అధికారులకు సూచించారు. గాలి వాన కారణంగా మొత్తం 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారని, కేంద్ర ప్రభుత్వానికి ఎంత చెప్పినా చెవిటోని ముందు శంఖం ఊదినట్లుగానే ఉందని మండిపడ్డారు.

ఈసారి పంట నష్టంపై కేంద్రానికి నివేదికలు పంపదల్చుకోలేదన్న కేసీఆర్.. ఒక వేళ తాము పంపినా కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావని చెప్పారు. దేశానికి కొత్త వ్యవసాయ విధానం అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.

-Advertisement-

ఇక కేసీఆర్ పర్యటన సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఇతర ఉన్నతాధికారులు, పలు పార్టీల నేతలు ఆయన వెంట ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటన తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. దీంతోపాటు కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాల్లో కేసీఆర్ పర్యటించారు. బాధిత రైలులను ఓదార్చారు.

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 23,116 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. పర్యటన సందర్భంగా బస్సులోనే కేసీఆర్ భోజనం చేసిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఇక కేసీఆర్ పర్యటనపై ఎప్పటిలాగే బీజేపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దొర కిందకు దిగి రావాలని, ఓటుతో ప్రజలు బుద్ది చెప్పాలని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

also read :

Nayanthara: బాబోయ్.. న‌య‌న‌తార డిమాండ్స్ విని బిత్త‌ర‌పోతున్న నిర్మాత‌లు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News