NTR : స్వశక్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిన జూనియర్ నందమూరి పేరు ప్రఖ్యాతలని పతాక స్థాయికి తీసుకెళుతున్నాడు. అయితే ఎన్టీఆర్ కొద్ది రోజులుగా నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకి ఎన్టీఆర్‌ని ఆహ్వానించగా, ఆ కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే నందమూరి అభిమానులు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత నెలలో విజయవాడలో నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కాగా, ఈ కార్యక్రమానికి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక రీసెంట్గా హైదరాబాద్ లో కూడా ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాన్ని గ్రాండ్ లెవల్లో నిర్వహించారు.
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. కానీ జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నందమూరి, నారా కుటుంబాలు ఎన్టీఆర్‌ని చాలా సంవత్సరాల నుంచి అవమానిస్తూ వస్తున్నాయని, అతణ్ని సినీరంగంలో కూడా తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టి ఉంటాడని ఓ వర్గం చెప్పుకొస్తుంది. విజయవాడలో జరిగిన వేడుకలకు తారక్ ను పిలవలేదు సరే, ఇప్పుడు పిలిచినా ఎందుకు హాజరు కాలేదు తాతపేరుతో జరుగుతున్న శతజయంతి వేడుకల కన్నా టూర్ ముఖ్యమా? పుట్టినరోజు ముఖ్యమా? అంటూ మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
అయితే తాజాగా ఈ ఇష్యూపై టిడిపి నేత, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్ని పర్యవేక్షించిన టిడి జనార్ధన్ మాట్లాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకి తారక్ ని ఇన్వైట్ చేయాలని చూడగా, ఆయన వారం తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. అయినా కూడా వెళ్లి ఆహ్వానించాం. అయితే ఆయన మాత్రం తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ ట్రిప్ వెళుతున్నాం అని, ప్రోగ్రాం ముందే ఫిక్స్ అయిందని చెప్పారు. పుట్టినరోజులు ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి.. కానీ శతజయంతి మాత్రం ఒక్కసారే వస్తుందని వివరించాం. అయినప్పటికీ చివరకు జూ. ఎన్టీఆర్ తన ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. కళ్యాణ్ రామ్ కి కూడా ట్రిప్ ఫిక్స్ అయిందేమో, అందుకే రాలేదు అనుకుంటా అంటూ టిడి జనార్ధన్ చురకలు అంటించారు. మొత్తానికి జనార్దన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి నందమూరి అభిమానుల్లో కుంపటి పెట్టేలా కనిపిస్తున్నాయి.
read more news :
Anasuya: ఇన్నాళ్లకు అనసూయ పశ్చాతాపం.. ఆ పని ఎందుకు చేసానంటూ భాదలో యాంకరమ్మ