HometelanganaTDP in Telangana: ఉత్తర తెలంగాణపై టీడీపీ నజర్‌.. ప్లాన్‌ ఏంటి ?

TDP in Telangana: ఉత్తర తెలంగాణపై టీడీపీ నజర్‌.. ప్లాన్‌ ఏంటి ?

Telugu Flash News

తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిన తెలుగుదేశం పార్టీ (TDP in Telangana) కి మళ్లీ జీవం పోసేలా కార్యాచరణ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడంతో తెలుగుదేశం పార్టీకి ఓ ఊపు వచ్చిందని క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. అదే ఊపులో ఉత్తర తెలంగాణలో కూడా మరో సభ చంద్రబాబు నిర్వహిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వెల్లడించారు. తద్వారా తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభకు టీ.టీడీపీ ప్లాన్‌ చేస్తోంది. బీఆర్‌ఎస్‌లోకి, బీజేపీలోకి వెళ్లిన ద్వితీయ శ్రేణి నాయకులను, పదవులు ఆశించి భంగపడ్డ నేతలను మళ్లీ టీడీపీలోకి రావాలని ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నూతన కమిటీలు, ముఖ్య నేతల జాబితాను తయారు చేసి చంద్రబాబుకు పంపినట్లు తెలుస్తోంది. దీన్ని పరిశీలించిన చంద్రబాబు.. కాసానికి తగిన సూచలు, సలహాలు ఇచ్చారట.

అయితే, తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన వేళ.. మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే, పదవుల ఎర చూపి పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఫిబ్రవరి రెండో వారంలో నిజామాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబు పాల్గొనే ఈ సభకు.. జన సమీకరణ భారీగా చేయాలని చూస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నిజామాబాద్‌లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.

సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు..

తెలంగాణలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌.. ఇలా త్రిముఖ పోరు సాగుతోంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకూ కీలకమే. అయితే, హంగ్‌ పరిస్థితి ఏర్పడితే తమకు అవకాశం రాకపోదా? అనే ఆలోచన అన్ని పార్టీలకూ ఉంది. పరిస్థితులు చూస్తుంటే హంగ్‌ వచ్చే ఆస్కారం ఉందని అధికార పార్టీ మినహా అన్ని పార్టీలూ అనుకుంటున్నాయి. అయితే, టీడీపీ ఫోకస్‌ పెట్టినట్లుగా కనీసం కొన్నిసీట్లయినా సాధిస్తే.. పట్టు నిలుపుకున్నట్లవుతుందని భావిస్తోంది. ఈ క్రమంలో ఏ మేరకు సఫలమవుతారో వేచి చూడాల్సిందే.

also read:

Hyderabad:మ‌ళ్లీ హైదరాబాద్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్.. టిక్కెట్స్ ఎప్పుడు, ఎలా పొందాలంటే..!

-Advertisement-

రోజా వర్సెస్‌ పవన్‌ కల్యాణ్‌.. రాజకీయ డైలాగ్‌ వార్‌లో ఎవరిది పైచేయి?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News