Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులకు శుభవార్త. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లను ఈనెల 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈనెల24వ తేదీన విడుదల చేయనున్నారు.
బుధవారం ఉదయం 10 గంటలకు దర్శన టికెట్లు ఆన్ లైన్‌లో విడుదలవుతాయని టీటీడీ తెలిపింది. తమ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
వేసవి సెలవులు కావడంతో తిరుమలలో అధిక రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు కుదిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను కూడా రద్దు చేశారు.
ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా తిరుమలకు వస్తేనే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే సామాన్య భక్తుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు అధికారులకు సహకరించాలని కోరింది.
ముందస్తుగా టోకెన్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా సులభంగా స్వామి వారి దర్శనం చేసుకునే వెలుబాటు కల్పిస్తూ ఉంటుందని టీటీడీ తెలిపింది.
Read Also : BRO: బ్రో టైటిల్ వెనక ఇంత అర్ధం ఉందా.. త్రివిక్రమ్ ఆలోచన మాములుగా లేదు..!