తారకరత్న (Taraka Ratna) ఫిబ్రవరి 18 న ఊహించని రీతిలో కన్నుమూసారు. ఆయన మరణం కుటుంబ సభ్యులని ఎంతగానో బాధిస్తుంది. అయితే తారకరత్నకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని బాలయ్యనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద కర్మ(శ్రద్ధాంజలి) కార్యక్రమాలు కూడా బాలయ్యనే నిర్వహిస్తున్నారు. విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ కలిసి ఈ దశదిన కర్మ చేస్తున్నారని తెలుస్తుంది.. అయితే పెద్ద కర్మకి సంబంధించిన కార్డ్‌లో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, వారి పిల్లల పేర్లు కుమార్తె నిష్క, కుమారుడు తనయ్ రామ్, కుమార్తె రేయ పేర్లు ఉంచారు.
మరో పక్క అలేఖ్య రెడ్డి కుటుంబానికి సంబంధించిన టి మధుసూదన్ రెడ్డి, టి శ్రీ హరిప్రియ, టి అవనీష్, టి ముక్తి అనే పేర్లు మెన్షన్ చేశారు. కానీ ఎక్కడా తారకరత్న తల్లిదండ్రుల పేర్లు కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతుంది.
తారకరత్న, అలేఖ్యలపై ఉన్న కోపంతోనే వాళ్లు దీనికి దూరంగా ఉంటున్నారనే గుసగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కొడుకు పెద్దకర్మని తల్లిదండ్రులు చేయకపోవడం ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 2న హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్‌లో తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
also read :
grapes in summer : వేసవి కాలంలో రోజూ గ్రేప్స్ తింటే లాభాలు ఇవీ..
Telangana BJP : కేసీఆర్‌ను గద్దె దించుతాం.. అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతలు