tan removal face pack |
టొమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. టమోటాను కట్ చేసి నల్లగా ఉన్న ప్రదేశంలో మర్దన చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. టమాటా రసంలో కాస్త పసుపు, శెనగపిండి కలిపి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ట్యాన్ తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.
పెరుగు చర్మాన్ని చల్లబరచడమే కాకుండా టాన్ రిమూవల్ గుణాలను కూడా కలిగి ఉంటుంది.కాస్త పెరుగు తీసుకుని టాన్ ఉన్న భాగాలపై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరా శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పిగ్మెంటేషన్‌ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే దీన్ని రెగ్యులర్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం డీ-టాన్ అయి మెరిసిపోతుంది.
also read :
Healthy Cooking Oils : ఏ నూనె ఆరోగ్యానికి మంచిది ? వివరాలు తెలుసుకోండి !