HomecinemaTamanna : తొలిసారి త‌న ప్రేమాయ‌ణంపై స్పందించిన త‌మ‌న్నా.. గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసింది..!

Tamanna : తొలిసారి త‌న ప్రేమాయ‌ణంపై స్పందించిన త‌మ‌న్నా.. గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసింది..!

Telugu Flash News

Tamanna : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా టాలీవుడ్ స్టార్ హీరోల‌తో క‌లిసి స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది.ఇటీవ‌ల ఈ అమ్మ‌డికి స‌రైన స‌క్సెస్ లు రాక‌పోవ‌డంతో దిగాలుగా ఉంది. మంచి హిట్ ద‌క్కితే మ‌ళ్లీ మున‌ప‌టి ఫాంకి వ‌స్తుంద‌ని ఆమె అభిమానులు అంటున్నారు. అయితే త‌మ‌న్నా ఇటీవ‌ల ఎక్కువ‌గా ప్రేమాయ‌ణాల‌తో వార్త‌ల‌లోనిలుస్తూ ఉంటుంది. తమన్నా- విజయ్ వర్మ రిలేషన్ పై కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తుండ‌గా, దీనిపై ఇటీవ‌ల విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్నా ఫైర్ అయింది.

‘మేమిద్దరం కలిసి ఓ మూవీలో యాక్ట్ చేయ‌గా, అప్పటి నుంచి మాపై రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు’ అని తమన్నా చెప్పుకొచ్చింది. మ‌రి ఈ అమ్మ‌డి స‌మాధానం చూస్తే రిలేష‌న్ షిప్‌లో ఉందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఈ అమ్మడు ఇప్పుడు చిరంజీవి ‘భోళా శంకర్’, రజనీకాంత్ ‘జైలర్’ చిత్రాల‌లో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రెండు పెద్ద సినిమాలే కాగా, ఈ రెండింటిలో ఒక‌టి అయిన పెద్ద విజ‌యం సాధిస్తే త‌మ‌న్నా క్రేజ్ పీక్స్ కి వెళ్ల‌డం ఖాయం అని అంటున్నారు.

also read :

Viral Video : ఎన్‌కౌంటర్‌ చేయబోమని రాసివ్వాలి.. అప్పుడే ఆస్పత్రికి వస్తానంటూ ఖైదీ హల్‌ చల్‌!

H-1B Visa : ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులకు గ్రేస్‌ పీరియడ్‌ పెంచనున్న యూఎస్!

MLC Kavitha : ఓ మహిళను ఈడీ కార్యాలయానికి ఎలా పిలుస్తారు? సుప్రీంలో కవిత పిటిషన్‌!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News