HomecinemaSurya : కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య.. వీడియో

Surya : కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య.. వీడియో

Telugu Flash News

కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (Vijaykanth) మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన స్టార్ హీరో సూర్య (Surya) , ఆయన సమాధి వద్ద నివాళి అర్పించారు. విజయకాంత్ స్మారక స్థూపం వద్ద ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

విజయకాంత్ మృతి తనను చాలా కలచివేసిందని చెప్పిన సూర్య, తన కెరీర్ ఆరంభంలో విజయకాంత్‌తో కలిసి పనిచేయడం తనకు అదృష్టంగా ఉందని అన్నారు. “పెరియన్నా” సినిమాలో విజయకాంత్ తనకు డ్యాన్స్, ఫైట్స్‌లో మెరుగవ్వడానికి చాలా సహాయం చేశారని తెలిపారు. ఆయన ఒక గొప్ప నటుడు, మంచి మనిషి అని కొనియాడారు.

విజయకాంత్ మరణం చిత్రసీమకు తీరని లోటు అని సూర్య అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News