తమ బతుకు తెరువు కోసం ప్రతి సంవత్సరం వేలల్లో పొరుగు దేశాలకు వెలుతుంటారు మన భారతీయులు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వారి ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటూ ఎప్పుడూ దేశ గౌరవాన్ని పెంచడంలో ఒక అడుగు ముందే ఉంటారు. అలా వెళ్ళి మన దేశ గొప్పతనాన్ని,మన వారి ప్రతిభను పొరుగు దేశానికి తెలిసేలా చేసిన వారిలో గూగుల్ సీఈఓ(Google CEO) సుందర్ పిచై (Sundar Pichai) కూడా ఒకరు.
1972,12న చెన్నైలోని ఒక మామూలు కుటుంబంలో జన్మించిన సుందర్ పిచై అసలు పేరు పి సుందరరాజన్ కాగా తన ఇంటి పేరు పెద్దది,తన పేరు చిన్నది చేయడంతో ఆయన పేరు సుందర్ పిచైగా మారింది.
చిన్న వయసు నుంచే చదువులో మెరుగ్గా ఉంటూ వచ్చిన సుందర్ పిచై ఇంటర్మీడియట్ వరకు తన చదువు చెన్నైలో పూర్తి చేయగా బి. టెక్ (b.tech) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1993లో పూర్తి చేశారు.
ఆపై ఎం.ఎస్ కూడా అక్కడే పూర్తి చేయమని తన సన్నిహితులు చెప్పినప్పటికీ సుందర్ పిచైకు అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో స్కాలర్ షిప్ రావడంతో అమెరికా వెళ్ళి అక్కడ తన ఎం.ఎస్ పూర్తి చేయడంతో పాటు ఆ తరువాత వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ కూడా చేశారు.
తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సొంతం చేసుకున్న సుందర్ పిచై తన ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల నుంచి తనకు నచ్చిన,తను ప్రేమించిన అంజలిని వివాహమాడారు.
సుందర్ ఆమె భార్య గురించి చాలా సందర్భాలలో మాట్లాడుతూ ఈరోజు తను గూగుల్ సీఈఓ గా ఆ స్థానంలో ఉండడానికి ఒక రకంగా అంజలి పిచైయే కారణం అని చెప్పారు.
Sundar Pichai గూగుల్ ప్రయాణం:
2004 లో గూగుల్ సంస్థలో ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరిన సుందర్ గూగుల్లో తన ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండి తన ప్రతిభతో అందర్నీ మెప్పిస్తూ అంచలంచలుగా ఎదిగారు.
2014లో గూగుల్ సంస్థలో రెండో స్థానానికి ఎదిగి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసిన ఆయన, ఆ ఏడాది గూగుల్ 3.2 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో నెస్ట్ లాబ్స్ ను సొంతం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు.
అటు వైపు ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపనీలు సుందర్ పిచైను తమతో పని చేయమని సీఈఓ(CEO) పదవిని స్వీకరించమని కోరినప్పటికీ తన భార్య అంజలి పిచై సూచనలతో, గూగుల్ పై ఉన్న విధేయతతో వాటిని తిరస్కరించారు.
సుందర్ ఊహించిన విధంగానే ఆయన నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలంగా నిలుపుతూ 2015లో గూగుల్ సీఈఓ పదవి ఆయన చెంతకు వచ్చి చేరింది.
ఆ విధంగా మన భారత దేశ గొప్పతనాన్ని తెలియచేస్తూ సంచలనంగా మారిన సుందర్ పిచై 2019 లో గూగుల్ కు చెందిన మరో సంస్థ అల్ఫాబెట్ కు(Alphabet inc) కూడా సీఈఓగా మారి అందర్నీ అవాక్కయ్యేలా చేశారు.
సుందర్ మన దేశాన్ని వదిలి వెళ్ళినప్పటికీ తన మూలాలను మరిచి పోకుండా భారత దేశాన్ని మరింత మెరుగైన దేశంగా చేయడంలో తనకు వీలైనంత వరకు సహాయం చేస్తూనే ఉన్నారు.
అయితే ఇటీవలే ఆయనకు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు భారత ప్రభుత్వం తరపున పద్మభూషణ్ అందించడం విశేషం.
ఏదేమైనా మన దేశం నుంచి వెళ్లి మన దేశ గౌరవాన్ని పెంచిన సుందర్ పిచై గురించి తెలుసుకుని అందరికీ తెలియచెప్పాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది.
also read news:
Satya Nadella : సామాన్యుడు నుంచి మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా.. సత్య నాదెళ్ల రియల్ లైఫ్ స్టోరీ
Kl Rahul: లక్కంటే కేఎల్ రాహుల్‌దే.. ఈ ఉదాహరణలు చూశాక ఒప్పుకోక తప్పదు..!