HomecinemaSukumar : సుకుమార్ భార్య‌కి వింత కోరిక‌.. అదేంటో తెలిస్తే మీరు అవాక్క‌వుతారు..!

Sukumar : సుకుమార్ భార్య‌కి వింత కోరిక‌.. అదేంటో తెలిస్తే మీరు అవాక్క‌వుతారు..!

Telugu Flash News

Sukumar :లెక్క‌ల మాస్టార్ సుకుమార్ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇటీవ‌ల పుష్ప అనే చిత్రంతో పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు పుష్ప‌2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అంద‌రిలో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవ‌ల పుష్ప 2 టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో సుకుమార్ భార్య తబిత తన భర్త డైరక్ట్ చేసిన రెండు సినిమాలు రీ రిలీజ్ చేస్తే చూడాలనుకుంటున్నట్టు మీడియాతో చెప్పుకొచ్చింది.

తబిత సుకుమార్ మాట్లాడుతూ… ” జగడం, 1 నేనొక్కడినే చిత్రాలు రీరిలీజ్ చేయమని నా భ‌ర్త‌ సుకుమార్ కు చెప్పాను , అవి రిలీజ్ అయ్యినప్పుడు ఎందుకు వాటికి జనం కనెక్ట్ కాలేదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను . ఆ సినిమాల విష‌యంలో ఏమన్నా మారిందా లేక అలాగే జరుగుతుందా చూడాలని ఉంది అంటూ త‌బిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కాగా, 2009లో సుకుమార్‌, తబితను ప్రేమ వివాహం చేసుకోగా, ఈ దంప‌త‌లుకి కుమార్తె సుకృతి, కుమారుడు సుకృత్‌ ఉన్నారు. ప్రస్తుతం తబిత లాండ్రీ కార్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ బిజినెస్‌ రన్ చేస్తున్న విష‌యం విదితమే.

also read :

Arjun Tendulkar: ఎట్టకేలకు సచిన్‌ తనయుడి అరంగేట్రం.. బౌలింగ్‌లో ముద్ర వేస్తాడా?

Japan PM: జపాన్‌ రాజకీయాల్లో కలవరం.. ప్రధానిపై బాంబు దాడి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News