Telugu Flash News

Medico Preeti : పోరాడి ఓడిన ప్రీతి.. అసలేం జరిగింది.. గదిలో ఏమేం ఇంజెక్షన్లు దొరికాయంటే..!

medico preethi

Full story of Medico Preeti : వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా తానున్నానని ధైర్యం చెబుతూ పది మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్‌ వృత్తిలోకి వచ్చిన గిరిజన యువతి ర్యాగింగ్‌ భూతానికి బలైంది. సీనియర్ల ఆకతాయి చేష్టలు, వేధింపులతో తీవ్రంగా విసుగు చెందిన ప్రీతి.. ఆత్మహత్యే శరణమని భావించింది. తనువు చాలించాలని భావించిన ఆమె నిర్ణయానికి విధి కూడా తలవంచింది. యువ వైద్యురాలు కానరాని లోకాలకు తరలివెళ్లిపోయింది.

జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండాకు చెందిన ధరావత్‌ నరేందర్‌ కుమార్తె ప్రీతి. నరేందర్‌ ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య శారద, పూజ, ఉష, ప్రీతి అనే ముగ్గురు కుమార్తెలు సంతానం. వీరితోపాటు వంశీ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కొన్నేళ్ల కిందటే వీరు హైదరాబాద్‌ నగరానికి షిప్ట్‌ అయ్యారు. చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలనే కోరికతో ప్రీతి పట్టుదలగా చదివేది. ఈ క్రమంలోనే గాంధీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2022 నవంబర్‌ 18న వరంగల్‌ కాకతీయ కాలేజీలో అనష్తీషియా పీజీ కోర్పులో చేరింది.

థియరీ తరగతుల్లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్‌ మెడికల్‌ స్టూడెంట్లతో కలిసి ఆపరేషన్‌ థియేటర్లో పని చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. సీనియర్‌ స్టూడెంట్‌ సైఫ్‌.. ప్రీతిని వేధించడం మొదలు పెట్టాడు. దీనిపై ప్రీతి తండ్రి పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. అనంతరం ఈ కేసును సెన్సిటివ్‌గా భావించిన పోలీసులు.. కేఎంసీ ప్రిన్సిపల్‌ మోహన్‌దాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనష్టీషియా విభాగం హెడ్‌ నాగార్జునరెడ్డి సమక్షంలో కౌన్సెలింగ్‌ కూడా జరిగింది. అయినప్పటికీ సైఫ్‌ ఆగడాలు ఆగలేదు.

ఈ క్రమంలోనే ప్రీతి తన ఛాతిలో నొప్పిగా ఉందని, జోఫర్‌, ట్రెమడాల్‌ ఇంజెక్షన్‌ కావాలని స్టాఫ్‌ నర్సును అడిగింది. తర్వాత ఉదయం అపస్మారక స్థితిలో ఉండటంతో తోటి వైద్య విద్యార్థినులు గమనించి గుండెపోటు వచ్చిందేమోనని సీపీఆర్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మొదట ఆత్మహత్యాయత్నాకి పాల్పడిందని భావించారు. ట్రెమడాల్‌ ఇంజెక్షన్‌ ఓవర్‌డోస్‌గా భావించారు. అయితే, ఆమె గదిలో సక్సినైల్‌కోలైన్‌, మెడజోలం, పెంటనీల్‌ ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. వీటిలో ఏ మందు తీసుకుందో తెలియక బ్లడ్‌ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్ష నిమిత్తం పంపారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి.. నిన్న సాయంత్రం కన్నుమూసింది. ఈ కేసులో నిందితుడు సైఫ్‌ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు.

also read :

NTR 30: వాయిదా ప‌డ్డ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు లాంచ్ కానుందంటే..!

walnuts for kids : పిల్లల చదువులపై ఒత్తిడి ఉందా? ఈ నట్స్ ట్రై చేయండి!

Alia Bhatt at Zee Cine Awards 2023 Photos and Videos

Anasuya: అన‌సూయ ‘ఆంటీ’ పై న‌టి క‌స్తూరి వివ‌ర‌ణ‌.. అది డ‌ర్టీ మీనింగ్ అంటూ కామెంట్

 

Exit mobile version