Sudigali Sudheer: జబర్ధస్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. ఈ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు హోస్ట్‌గా,హీరోగా కూడా అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా సుధీర్ కి వివాహ వయసు దాటిపోయి చాలా కాలమే అవుతుంది. ఆయన తోటి కమెడియన్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనడం మనం చూశాం.
అయితే సుధీర్ మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆయన తమ్ముడికి కూడా వివాహం అయినట్లు తెలుస్తుంది. అయితే సుధీర్.. యాంకర్ రష్మీ గౌతమ్ ని ప్రేమిస్తున్నాడని, త్వరలో వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.. సుధీర్-రష్మీలను మీ మధ్య ఉన్న బంధం ఏంటని అడిగితే స్పష్టమైన సమాచారం ఒక్కసారి కూడా ఇవ్వలేదు.
ఒక ప్రక్క ఖండిస్తూనే… మరో ప్రక్క హింట్స్ ఇస్తూ ఉన్నారు ఈ క్రేజీ జంట. అయితే తాజాగా సుధీర్ పెళ్ళికి సిద్దమయ్యారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సుధీర్ బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాని, ఆమె అతనికి వరుసకు మరదలు అవుతుందని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
also read :
gas cylinder : గ్యాస్ సిలిండర్ ఎక్కువ కాలం మన్నిక రావాలంటే ఇలా చేయండి..