Homebigg boss telugu season 6bigg boss telugu 6 : బిగ్ బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా ?

bigg boss telugu 6 : బిగ్ బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా ?

Telugu Flash News

bigg boss telugu 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్ర‌మం ఇప్పుడిప్పుడే కాస్త ర‌స‌వ‌త్తరంగా సాగుతుంది. ఆదివారం వ‌స్తే ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతుంటారు. అయితే ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనే చ‌ర్చ‌లు న‌డ‌స్తున్న నేప‌థ్యంలో అస‌లు విష‌యం లీకైంది. సుదీప బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇప్పటి వరకు సుదీప నామినేషన్లలో పెద్దగా లేదు. ఎక్కువగా కిచెన్‌కే పరిమితం అవుతుందనే అప‌వాదు మోసింది. ఆమెకి అదే పెద్ద మైనస్‌ అని తెలుస్తుంది. ఇటీవల వారి ఇంటి వాళ్లు, హౌజ్ మేట్స్, నాగార్జున కూడా ఇదే విష‌యాన్ని చెప్పారు. అయితే తాను జాగ్ర‌త్త పడే స‌మ‌యానికి ఎలిమినేట్ అయింద‌ని తెలుస్తుంది.

ఆమె ఎలిమినేట్ ప‌క్కా..

ఎలిమినేషన్‌లో సుదీప, రాజ్‌ చివరకు మిగలగా అందులో అనేక ట్విస్ట్‌ల అనంతరం సుదీపని ఎలిమినేట్‌గా నాగార్జున ప్రకటించినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్ మెంట్స్ తో మాట్లాడుతూ.. ఒక్కరికి క్లారిటీ వచ్చేలా చేశాడు. రోహిత్ కోసం ఎవరు త్యాగం చేస్తారు అన్న విషయానకి వచ్చినప్పుడు అందరూ ఓకే అన్నప్పటికీ, అంతా కలిసికట్టుగా వాసంతిని డిసైడ్ చేశారు. దీంతో వాసంతి తన జుట్టును భుజాల వరకూ కట్ చేసుకోవల్సి వచ్చింది ఈవీక్ ఎలిమినేషన్ లో శ్రీసత్య, శ్రీహాన్, అర్జున్, గీతు, వాసంతి, ఆదిత్య, కీర్తి, సుదీప తదితరులు ఉండగా. అందులో ఈశనివారం శ్రీసత్యను మాత్రమే సేవ్ చేశారు.

ఇక ప్రతీవీకెండ్ మాదిరిగానే హౌజ్‌మేట్స్ తో సరదాగా ఆటలాడించాడు నాగార్జున‌. ఇక ఇందులో బాగంగా..కొంత మందిని మాత్రమే ప్రత్యేకమైన గడిలోకి పిలిచి వారి గురించి ముచ్చటించారుకింగ్. అంతే కాదు ఈ క్రమంలో బాలాదిత్యను గీతూ మోసం చేయడం,స్మోక్ చేయకుండా చేయడం, ఫైమా ఫన్నీ జోకులతో సంద‌డిసంద‌డిగా సాగింది. ఇక హౌస్ మెట్స్ కు గుడ్ ఆర్ బాడ్.. ఆవరేజ్ ర్యాంక్ లు ఇచ్చారు నాగార్జున‌. ఆట విషయంలో ఫైమ, గీతు, రేవంత్, సూర్య లాంటి మరి కోందరికి మాత్రమే.. గుడ్ వచ్చింది. ఇనయన గేమ్ నుంచి..మనుషుల మీదకు టర్న్ అవుతుందంటూ నాగ్ చుర‌క‌లు అంటించారు. మొత్తానికి శ‌నివారం ఎపిసోడ్ సంద‌డిగానే సాగింది.

ఇవి కూడా చూడండి :

మీ పిల్లలు మీ మాట వినటం లేదా..ఇలా చేసి చూడండి

Rashmika Mandanna : బికినీలో రష్మిక మందన్న.. వైరల్ అవుతోన్న పిక్స్

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News