Telugu Flash News

Success Story : ఇంటర్‌ ఫెయిల్‌ నుంచి ఐపీఎస్‌ దాకా.. మనోజ్‌ శర్మ విజయగాధ!

Success Story : సమాజంలో చాలా మందికి స్పూర్తిగా నిలిచేలా కొందరు కష్టపడి తమ లక్ష్యాన్ని సాధిస్తుంటారు. ఇలా సక్సెస్‌ అయిన వారు జీవితంలో పడిన బాధలు, ఎదుర్కొన్న కష్టాలు రేపటి తరానికి ఆదర్శవంతంగా నిలుస్తుంటాయి. కొందరు జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంటారు.

ఇలా కష్టాలను లెక్కచేయక లక్ష్యం దిశగా అడుగులు వేసిన వారే విజయ తీరాలకు చేరుతుంటారు. ప్రస్తుతం ఇంటర్‌ ఫెయిలైతేనే చాలా మంది స్టూడెంట్స్‌ సూసైడ్‌ చేసుకుంటూ కన్నవాళ్లకు గుండెకోత మిగుల్చుతున్న క్రమంలో ఓ ఐపీఎస్ అధికారి జర్నీ ఇప్పుడు నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

సదరు ఐపీఎస్ అధికారి ఇంటర్‌ ఫెయిలయ్యారట. అయితేనేం, ప్రస్తుతం కొందరు చేస్తున్నట్లుగా బలవన్మరణానికి పాల్పడలేదు. కుంగిపోవడం అసలే చేయలేదు. అంతే కాదు.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ పరీక్షను నాలుగు సార్లు రాసి తన లక్ష్యాన్ని చేరుకున్నారట.

ఆయన జర్నీని చూసి ఇప్పటి యువత బుద్ధి తెచ్చుకోవాలంటూ చాలా మంది పెద్దలు సోషల్‌ మీడియాలో షేర్లు చేస్తున్నారు. ఆయన పడి లేచే కెరటాలను ఆదర్శంగా తీసుకొన్నారని చెబుతున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు, కడగండ్లు ఎదురైనా వాటి నుంచి గుణపాఠం నేర్చుకొని జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొండత ఓపిక అవసరం అని చెబుతున్నారు.

ఇక ఈ ఐపీఎస్‌ విజయ గాధ విషయానికి వస్తే.. యూనియన్‌ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ను ఏటా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నిర్వహిస్తుంది. ఇందులో పాస్‌ కావడం అనేది అంత ఈజీ కాదు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే పట్టుదల అవసరం.

ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు కాదు.. లక్ష్యాన్ని చేరుకొనే దాకా ప్రయత్నిస్తూనే ఉంటారు కొందరు. వారిలో ఒకరు ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ. తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించారు.

మనోజ్ శర్మ ఇంటర్‌లోనే ఫెయిల్‌ అయ్యారు. హిందీ మినహా అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. పదో తరగతి కూడా థర్డ్ క్లాస్‌తో గట్టెక్కారు. చిన్నతనంలో తనకు ఎదురైనా పరాజయాలను చూసి మనోజ్ కుంగిపోలేదు. పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ‘ట్వెల్ఫ్త్ ఫెయిల్’ అనే జీవిత చరిత్రను రచయిత అనురాగ్ పాఠక్ రాశారు. ప్రస్తుతం మనోజ్‌ శర్మ జీవిత గాధ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. యూపీఎస్సీలో మూడు సార్లు విఫలమైన మనోజ్‌ శర్మ.. నాలుగో ప్రయత్నంలో 121వ ర్యాంకును సాధించారు. ఇప్పుడు ముంబై పోలీస్‌ శాఖలో అదనపు కమిషనర్‌గా ఆయన పని చేస్తున్నారు.

also read :

YSRCP : నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది.. తాడిపత్రి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!

Bala Krishna: ఒకే ఫ్రేములో బాల‌య్య‌, ర‌జ‌నీకాంత్.. అదిరిపోలా..!

Exit mobile version