HomecinemaBala Krishna: ఒకే ఫ్రేములో బాల‌య్య‌, ర‌జ‌నీకాంత్.. అదిరిపోలా..!

Bala Krishna: ఒకే ఫ్రేములో బాల‌య్య‌, ర‌జ‌నీకాంత్.. అదిరిపోలా..!

Telugu Flash News

Bala Krishna: ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లలో భాగంగా శుక్రవారం సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో సభ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ నేడు విజయవాడ చేరుకున్నారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్థన్‌ తదితరులు గ్రాండ్‌గా వెల్‌క‌మ్ చెప్పారు.

అయితే సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసానికి ర‌జ‌నీకాంత్ వెళ్ల‌నుండ‌గా, చంద్రబాబు.. రజినీకాంత్‌కు తేనీటి విందు ఇవ్వనున్నారు. అనంతరం ర‌జనీకాంత్ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో రజినీ పాల్గొంటారు.

అయితే ర‌జ‌నీకాంత్‌కి స్వాగ‌తం ప‌ల‌కడానికి వెళ్లిన బాల‌కృష్ణ .. ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి ఫోటో దిగ‌గా ఇప్పుడు పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

కాగా, రజినీకాంత్‌ కృష్ణా జిల్లాకు రావటం ఇది రెండో సారి. 2004లో కృష్ణా పుష్కరాల సమయంలో ఓ సారి వ‌చ్చిన త‌లైవా మ‌ళ్లీ 15 ఏళ్ల త‌ర్వాత ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకోసం కృష్ణా జిల్లాలో సంద‌డి చేయ‌బోతున్నారు.

అయితే ఎన్టీఆర్‌, రజినీకాంత్‌కు మ‌ధ్య‌ చక్కటి అనుంబంధం ఉంది. రజినీకాంత్‌.. ఎన్టీఆర్‌ను అన్నగారు అని పిలిచేవారు. రజినీ.. ఎన్టీఆర్‌తో కలిసి టైగర్‌ అనే సినిమాలో నటించ‌గా, ఆ స‌మ‌యంలో అనేక స‌ల‌హాలు సూచ‌న‌లు చేసినట్టు తెలుస్తుంది.

also read :

-Advertisement-

‘Ponniyin Selvan 2′ Review :’పొన్నియన్ సెల్వన్ 2’ తెలుగు మూవీ రివ్యూ

Agent Telugu Movie Review : ‘ఏజెంట్’ తెలుగు మూవీ రివ్యూ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News