Moral Stories in telugu : పిల్లలూ.. ఈ రోజు మీకు ఒక మంచి కథ చెప్తాను.. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు అని ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం..
చాలా కాలం క్రితం ఒక రాజ్యంలో మిడాస్ అనే రాజు ఉండేవాడు. అతను ఒక గ్రీక్ దేవుడి కోసం ఒక మంచి పని చేస్తాడు . బదులుగా ఆ దేవుడు మిడాస్ ని ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు.
నేను టచ్ చేసింది అంతా బంగారం కావాలి , ఏది తాకిన బంగారంగా మారిపోవాలి” అని అడుగుతాడు . దానికి ఆ దేవుడు ఇంకా వేరే ఏదైనా కోరుకో.. ఈ కోరిక అడగటం వల్ల నువ్వు చాలా నష్టపోతావు అని వార్నింగ్ ఇస్తాడు.
కాని ఆ రాజు నాకు ఇదే కావాలి, బంగారమే కావాలి అని అంటాడు, ఇంకా వేరే ఏమి వద్దు అని రాజు ఆ దేవుణ్ణి వేడుకుంటాడు. ఇక చేసేదేమి లేక దేవుడు ఆ వరం ప్రసాదిస్తాడు.
కోరుకున్న వరం దొరికింది కదా అని ఆ రాజు అన్నీ రకాల వస్తువులని తాకుతూ వాటిని బంగారంగా మారుస్తూ ఆనందం పొందుతుంటాడు. ఆ తర్వాత మిడాస్ కు ఆకలి వేస్తుంది. తిందామని అన్నాన్ని తాకగానే అది బంగారం గా మారిపోతుంది.
బంగారాన్ని తినలేము కదా.. దాహమేసి నీళ్ళని తాగుదామంటే అవి కూడా గోల్డ్ గా మారిపోయాయి.
చేసేదేమి లేక.. ముక్కుతూ.. ములుగుతూ బాధపడుతూ.. దేవుడు ఎంత చెప్పిన నేను వినలేదు.. కోరుకున్న ఈ కోరిక అంత మంచిది కాదేమో అని తెలుసు కుంటాడు..
బాధపడుతున్న తన తండ్రిని ఓదార్చడానికి తన కూతురు దగ్గరికి వస్తుంది. కూతురు కదా అని దగ్గరికి తీసుకోవడంతోనే ఆ చిన్నారి బంగారంగా మారిపోతుంది. ఇంకేముంది.. వరమే శాపంగా మారుతుంది..
రాజు ఎంత ఏడ్చిన ఏది తిరిగిరాదు. బంగారం ఎంత ఉన్న ఏం లాభం.. తినడానికి తిండి.. పలకరించే మనుషులు లేనప్పుడు.
కాబట్టి , పిల్లలు మీరు ఏం నేర్చుకున్నారు. “ఆశపడు తప్పులేదు కానీ అత్యాశ అన్ని అనర్థాలకు కారణం అని తెలుసుకుందాం.
బై బై.. పిల్లలు..
read more stories :
moral stories in telugu : నీతి కథలు చదవండి