Sri Reddy: ఒకప్పుడు చిన్నా చితకా సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసిన శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ఒక్కసారిగా హైలైట్ అయింది. సినిమా ఆఫర్స్ ఇస్తా అని చెప్పి చాలా మంది తనని మోసం చేశారని శ్రీరెడ్డి వాపోయింది.ఇక ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో తెగ పాపులర్ అయ్యారు.
ఇక కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఏకంగా ఈమె తెలుగు చిత్ర పరిశ్రమను వదిలి వేసి చెన్నై వెళ్లి స్థిరపడాల్సి వచ్చింది. చెన్నై లో ఉన్నటువంటి ఈమె ఎలాంటి సినిమాల్లో నటించకుండా కేవలం యూట్యూబ్ వీడియోలతో, లేదంటే సోషల్ మీడియా వీడియాలతో అభిమానులకు వినోదం పంచుతుంది.
అందాల పెట్టుబడి..
మీటూ ఉద్యమం నేపథ్యంలో శ్రీరెడ్డి ఇండస్ట్రీ బిగ్‌షాట్స్ పై చాలా ఆరోపణలు చేసింది. ఒకానొక స్టేజ్‌లో ఆమె ఆరోపణలు మరింత దిగజారాయి. స్టార్ హీరో తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీ పెద్దలు కాస్త నటి శ్రీరెడ్డిని బహిష్కరించడంతో వెళ్లి అక్కడ పడింది.
ఇక అక్కడ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ జీవనం సాగిస్తుంది. తరచుగా వంటలు వీడియోలు, అలాగే బ్యూటీ టిప్స్ వంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. సోషల్ మీడియా ద్వారా నెలకి దాదాపుగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు సంపాదిస్తున్నట్లు జనాలు చర్చించుకుంటున్నారు.
అయితే మాములుగా వంటలు చేస్తే ఎవరు చూస్తారు. గతంలో మాదిరిగా తన అందాలు ఆరబోస్తూ కొత్తరకంగా మాటలు చెబుతూ కుర్రకారుని అట్రాక్ట్ చేస్తుంది. మధ్య మధ్యలో శ్రీరెడ్డి బూతుల రచ్చ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉండబట్టే కుర్రకారు ఎగబడి శ్రీరెడ్డి వీడియోలు చూస్తున్నారు.
ఆమె తన వంటలు వీడియో షేర్ చేసిందంటే చాలు కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు, వ్యూస్ వర్షంలా కురుస్తున్నాయి.
ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును తెలియజేస్తోన్న నేపథ్యంలో పార్టీ తరపున కూడా కొంత ఫండ్స్ వస్తాయనే టాక్ అయితే ఉంది.